ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఈమె సినిమాలకు ఎందుకు దూరం గా ఉంటున్నారో తెలుసా!!

kalpana
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో నటీమణులు తమ అందం, అభినయంతో   ప్రేక్షకాదరణ పొంది కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో శరణ్య మోహన్ ఒకరు. ఈమె తెలుగు " విలేజ్ లో వినాయకుడు " అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు అయినా హీరోయిన్గా శరణ్య మోహన్ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

 తర్వాత నాని హీరోగా "భీమిలి కబడ్డీ జట్టు" అనే చిత్రంలో శరణ్య మోహన్ మంచి పేరు తెచ్చుకుంది తన అందం, అభినయం తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో ఆమె నటించింది. తర్వాత "హ్యాపీ హ్యాపీ గా "  "ముద్ర " వంటి కొన్ని సినిమాల్లో ఆమె నటించింది. శరణ్య మోహన్ తమిళంలో నటించిన "యారాది నీ మోహిని" అనే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఆ సంవత్సరం అత్యధిక వసూలు చేసిన తమిళ సినిమాగా రికార్డు నమోదు చేసింది.

శరణ్యకు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌పై మక్కువ ఎక్కువ. సూపర్ హిట్ చిత్రం 'అనితిప్రవు' లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. శరణ్య ఎక్కువగా తమిళ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఆమె నాలుగు టెలివిజన్ సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించింది.

శరణ్య మోహన్ 2015 లో అరవింద్ కృష్ణన్‌ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయట. కానీ పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి సినిమాల నుంచి విరామం తీసుకున్నట్టు ప్రకటించింది.

శరణ్య మోహన్ ప్రస్తుతం డ్యాన్స్ పై మక్కువతో నాట్యభారతి అనే డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: