సారీ.. ఆ సీక్రెట్ చెప్పలేను.. టెన్షన్ పెంచేస్తున్న నిహారిక...!

VAMSI
" data-original-embed="">

సీక్రెట్ అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది కొణిదెల వారి ఆడ పడుచు నిహారిక.  పెళ్లికి ముందు నిహారిక వేరు...ఇప్పుడు పెళ్లి తర్వాత నిహారిక వేరు అన్నట్లుగా అయిపోయింది ఈ అమ్మడు. మరీ అంత వ్యత్యాసం లేదు కానీ కొంత అయితే ఉందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ మెగా ప్రిన్సెస్ చేస్తున్న హడావిడి చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
మెగా హీరోయిన్ అన్న తర్వాత ఆ మాత్రం స్పీడ్ ఉండాలి మరి. నిజానికి పెళ్లి తర్వాత నిహారిక అసలు కెమెరాకి కనబడుతుందా అని అందరూ అనుకున్నారు.

గతంలోలా ఇకముందు ఈమె సందడి చేయదేమో నని చింతించారు మెగా ఫ్యాన్స్. కానీ  మెగా సుందరి నిహారిక మాత్రం పెళ్లి తర్వాత తన అల్లరిని ఇంకాస్త పెంచి సోషల్ మీడియాలో హల్ చల్  చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్ డేట్స్ ను అందిస్తూ అభిమానులను అలరిస్తోంది నిహారిక. నాకు ఓ రహస్యం తెలుసు.. కానీ అది చెప్తే అది రహస్యం ఎలా అవుతుంది చెప్పండి...? అయినా నేను దాచిపెట్టిన సీక్రెట్ ఏంటో ఒక్క జోసెఫ్ రాధిక్‌కు మాత్రమే తెలుసు.. అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది మెగా డాటర్.

జోసెఫ్ రాధిక్ ఎవరనుకుంటున్నారా..?? నిహారిక, చైతన్య జొన్నలగడ్డ పెళ్లికి ఫోటోలు తీసిన ఓ ఫేమస్ ఫోటోగ్రఫర్. తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా చాలా మంది ప్రముఖుల పెళ్లిళ్ళకు ఈయన ఫోటోలు తీసాడు. ఇప్పుడు ఈయనకు, నిహారికకు మాత్రమే ఓ సీక్రేట్‌ తెలుసని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసింది మెగా డాటర్. మరి ఆ సీక్రెట్ నిహారిక కు సంబంధించిందా లేదా చైతన్యకు సంబంధించినదా లేదా ఇద్దరిదా ... కొంచెం చెప్పొచ్చుగా అంటూ అడుగుతున్నారు అభిమానులు. ఇంతకీ నిహారిక ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేస్తుందా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: