ఫిలిమ్ నగర్ ను కుదిపేస్తున్న రభస చర్చలు !

frame ఫిలిమ్ నగర్ ను కుదిపేస్తున్న రభస చర్చలు !

Seetha Sailaja
రాబోతున్న స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల కాబోతున్న ‘రభస’ సినిమా ఎరేంజ్ లో ఉంటుంది అనే విషయం పై అప్పుడే ఫిలింనగర్ లో చర్చలు మొదలు అయ్యాయి. జూనియర్ కు తన సినిమాలకు సంబంధించి పెద్ద హిట్స్ ఉన్నా ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కూడ 50 కోట్ల మైల్ స్టోన్ ను దాటాక పోవడం జూనియర్ అభిమానులనే కాకుండా ఎన్టీఆర్ ను కూడ టెన్షన్ లో పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే ‘రేసు గుర్రం’ ఘన విజయంతో టాలీవుడ్ టాప్ ఫోర్ లో అల్లుఅర్జున్ స్థానం సంపాదించుకావడంతో ప్రస్తుత రేటింగ్స్ లో జూనియర్ టాలీవుడ్ టాప్ ఫోర్ లో తన స్థానం పోగొట్టుకున్నాడు. దీనితో రాబోతున్న ‘రభస’ హిట్ కావడమే కాకుండా కలెక్షన్స్ వర్షాన్ని కురిపించి 50 కోట్ల మైలురాయిని దాటినప్పుడు మాత్రమే జూనియర్ తిరిగి తను పోగొట్టుకున్న టాప్ ఫోర్ స్థానాన్ని పొంద గలుగుతాడు అనే వాదన ఉంది.  అయితే టాక్ విషయంలో ‘రభస’ ఏమాత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా 50కోట్ల మార్క్ ను ‘రభస’ అందుకోవడం కష్టం అని అంటున్నారు విశ్లేషకులు. జూనియర్ క్రేజ్ తో పాటు బ్రహ్మనందం టాప్ కామెడి కూడ కలిసి వచ్చేలా చేసిన ‘రభస’ యూనిట్ ప్లాన్ సక్సస్ అయితేకాని యంగ్ టైగర్ ‘రభస’ నిజంగా ‘రభస’ చేయడం కష్టం అని అంటున్నారు.  ఇది ఇలా ఉండగా మొన్న విడుదల అయిన ‘రభస’ ట్రైలర్ లో బ్రహ్మి వదిలిన డైలాగ్ ‘రేయ్ రేయ్ రేయ్ నేను సింహాద్రికి సీక్వెల్ రా’ అన్న డైలాగ్ బట్టి ‘రభస’ లో సింహాద్రి ఛాయలు ఉంటాయ? అనే ఆశక్తికర చర్చలు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: