వామ్మో సమంత బ్యాగ్ ధర ఇంతా.. షాక్ అవుతున్న అభిమానులు..?
సాధారణంగానే టాలీవుడ్ లో అక్కినేని వారి కోడలు సమంత కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది అనే విషయం తెలిసిందే. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతూన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక పెళ్లి తర్వాత మరింత జోష్ తో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది సమంత. అయితే ఇటీవలే సమంత ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే ఎయిర్ పోర్టులో సమంత దర్శనం ఇవ్వగా ఫోటోగ్రాఫర్లు సమంత ఫోటోలు క్లిక్ మనిపించారు. ఈ క్రమంలోనే సమంత చేతిలో ఉన్న బ్యాగ్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఇక సమంత చేతిలో ఉన్న బ్యాగ్ ధర ఏకంగా 2 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రస్తుతం ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే అంత ఖరీదైన బ్యాగ్ సమంత చేతిలో మరింత అందంగా ఉంది అంటూ ప్రస్తుతం ఎంతో మంది అభిమానులు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే సమంత కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సమంత సినిమాల విషయానికి వస్తే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్నకాదు కాతువాకుల రేండ్ కాతాల్ అనే సినిమాలో నటిస్తుంది సమంత. ఈ సినిమాలో విజయ్ సేతుపతి జోడిగా నటిస్తోంది.