ఆడియన్స్ ని నిరాశపరిచిన రెడ్ మూవీ...
సిద్ధార్థ్ కంటే ఆదిత్య పాత్రనే బాగా ఓన్ చేసుకోవడం వలన క్లాస్ రోల్లో వైవిధ్యం చూపించలేకపోయాడట. మాస్ రోల్ కు మాత్రం బాగా చేసాడు. మ్యానరిజమ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. కాని క్లాస్ రోల్ పెద్ద ఆకట్టుకోలేకపోయిందట. మాళవిక, అమృత అయ్యర్, నివేతా పేతురాజ్, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, సత్య, పవిత్ర లోకేష్ లు తమ పాత్రలకు బాగానే న్యాయం చేయడం జరిగింది.ఇక సినిమాలో కాస్తో కూస్తో పాజిటివ్ గా చెప్పాలంటే మణిశర్మ సంగీతం గురించి. తన సంగీతంతో బాగానే ఆకట్టుకున్నాడు మణిశర్మ.ఆయన ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ సోసోగా ఉన్నాయి.
దర్శకుడు కిషోర్ తిరుమల అసలు కథను అడాప్ట్ చేసుకోవడానికి పెద్దగా ప్రయత్నించలేదు. కథనాన్ని అవసరానికి మించి సాగదీసాడు. చేసిన చిన్నపాటి మార్పులు కూడా సినిమాకి ప్లస్ అవ్వకపోగా.. మైనస్ గా మారాయట.హీరోయిన్స్ ను పాత్ర మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు.నీవేదా పేతురాజ్ పాత్ర కూడా సోసోగానే ఉందట..మొత్తానికి ఈ సినిమా కూడా ఆడియన్స్ ని నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..