నమ్రత సోదరి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
శిల్పా శిరోద్కర్ ఈమె గురించి పెద్దగా ఎవరికీ పరిచయం లేదు.కానీ నమ్రత సోదరి అంటే మాత్రం అందరికీ గుర్తొస్తుంది.నిజానికి ఈమె ఒక మోడల్, నటి కూడా
అంతేకాకుండా హిందీ చిత్రాలలో కూడా నటించింది.అయితే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ను 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకొని, ఆ తర్వాత సినీ రంగానికి దూరంగా ఉంటూ వస్తోంది. అంతేకాకుండా ఈమెకు ఏ పాత్ర అయినా నచ్చితేనే,ఆ సినిమాలో నటిస్తుంది. ఈమె ఎప్పుడూ ఏదో ఒక మంచి పాత్ర కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది.
శిల్పా శిరోద్కర్ కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది.1992 వ సంవత్సరంలో బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు గారు నటించిన" బ్రహ్మ" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమాలో ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ ఈమె నటనకు మంచి స్థాయిలోనే గుర్తింపు వచ్చింది అప్పట్లో. కానీ ఈమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రాక పోయేటప్పటికి, మళ్లీ టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు.
ఇక ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచ దేశాల ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఇక రీసెంట్ గా కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చింది. అయితే మన దేశంలో చాలా మంది అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా స్వచ్ఛందంగా వెళ్లి, కరోనా వ్యాక్సిన్ను వేయించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కొంత మంది పై కరోనా వ్యాక్సిన్ ట్రయిల్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ ట్రయిల్ కోసం సినీ రంగం నుంచి ఏ ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదు.
కానీ శిల్పా శిరోద్కర్ మాత్రం స్వచ్ఛందంగా వెళ్లి,వ్యాక్సిన్ వేయించుకొని, ఆ ఫోటో ను ఇన్స్టాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఎవరు చేయలేని సాహసం శిల్పా చేసిందని,అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల కలిగే భయాలను ప్రజల నుండి దూరం చేయడానికి నేను స్వచ్చందంగా వచ్చి, వ్యాక్సిన్ వేయించుకున్నాను అని ఆమె తన సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేసింది.