దేవదాస్ మూవీ పై ఎమోషనల్ అయిన హీరో రామ్...!

VAMSI
" data-original-embed="">

తన ఎనలేని సంతోషాన్ని... ఉప్పొంగుతున్న ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు యంగ్ హీరో రామ్ పోతినేని. ఇంతకీ ఆ సంతోషం ఏంటో తెలుసా....??? రామ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తన మొదటి చిత్రం దేవదాస్ రిలీజ్ అయి ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టీ పెట్టగానే సాలిడ్ హిట్ లభించడమంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం... ఆ విజయం ఇచ్చే కిక్ ఇంకెందులోనూ లభించదు. అందులోనూ ఫస్ట్ సినిమా కే బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు.. అలాంటిది దేవదాస్ సినిమా ఘన విజయంతో రామ్ కెరియర్ కు శ్రీకారం చుట్టింది.

అది ఇచ్చిన బూస్ట్‌తో తన సినీ జర్నీని ఫుల్ స్పీడ్ తో నడిపాడు.... కానీ అక్కడ అక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఎదురైనప్పటికీ.. అన్నింటినీ అధిగమించి మళ్ళీ జోరు పెంచారు ఈ హీరో.  దేవదాసు ఇచ్చిన బూస్ట్‌తో జర్నీని ఫుల్ స్పీడ్ తో నడుపుతున్నాడు.  ఇప్పుడదే సంతోషాన్ని మనతో పంచుకున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో. తనకు దేవదాసు చిత్రం వంటి గొప్ప కథతో సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శకుడు వైవీఎస్‌ చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంత అద్భుతమైన అవకాశం ఇవ్వబట్టే తన కెరియర్ ఇలా సక్సెస్ ఫుల్ గా  సాగుతోంది అంటూ ఎమోషనల్ అయ్యారు. సినీ జీవితంలో మొదటి సినిమా అనేది ఆ హీరోకి చాలా కీలకం.... ఆ సినిమా ఫ్లాప్ అయితే కెరియర్ ఆగిపోదు కానీ .... చిట్టి అయితే మాత్రం ఆ హీరో కెరియర్ కు విశిష్టమైన ఆదరణ లభిస్తుంది.

అలాంటిదే దేవదాసు సినిమా ద్వారా వై.వి.యస్.చౌదరి నాకు ఇచ్చారని.... అందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ.. క్రెడిట్ గోస్ టు  చౌదరి గారు అని అభిప్రాయపడ్డారు రామ్. ఉంటుంది"పదిహేనేళ్ల వయసులో టాలీవుడ్‌ అనే స్వర్గంలోకి అడుగు పెట్టాను. దేవదాసు రిలీజై సరిగ్గా పదిహేనేళ్లు గడుస్తోంది. నా ప్రియమైన ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఎంటర్‌టైన్‌ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను కూడా! అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్వీట్‌ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు రామ్. దేవదాసు పోస్టర్‌ను సైతం పోస్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం నటించిన తాజా చిత్రం రెడ్. ఈ సినిమాను ఈ నెల 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఈ సినిమాలో కథానాయికలు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగుతో సహా మొత్తం ఏడు భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. సంక్రాంతి పండుగ పర్వదినాన ఈ మూవీ రామ్ కి ఎలాంటి పండుగను ఇవ్వనుందో చూడాలి...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: