కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తున్న సూపర్ స్టార్...!
ఇప్పుడు టాలెంట్ ఉన్న నూతన దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తూ కెరీర్ లో కొత్త మెరుపులు కోసం న్యూ ట్రాక్ సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు చాలా కొత్తగా కథలను తెరకెక్కించే తీరు మహేష్ ని బాగా ఆకట్టుకుందట. దీనికి నిదర్శనంగా మనము చాలా సినిమాలను చూశాము. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ గా మారిపోయిందంటే నమ్మండి. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ సాలిడ్ హిట్ లను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే బాట పట్టారు హీరో మహేష్...ఈ ప్రణాళికను అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ప్రారంభమైందని చెప్పొచ్చు. దీని తరువాత గీత గోవిందంతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ పరుశురాం కి అవకాశం ఇచ్చాడు.
ఇప్పుడు ఇతని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా ఇదే. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న రూమర్ల ప్రకారం తాను నెక్స్ట్ చేయబోయే సినిమా వెంకీ కుడుములతో చేయనున్నారని తెలిసింది. ఈ విధంగా చూసుకుంటే భవిష్యత్తులో మరింతమంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. మహేష్ పల్స్ తెలుసుకున్న నూతన దర్శకులు ఎలాగైనా తనతో సినిమా చేయాలని కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక శుభపరిణామమని చెప్పవచ్చు.