ఆచార్య, గ్యాంగ్ లీడర్ సినిమాలకు పోలిక ఉందా..?

P.Nishanth Kumar
మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయన గత సినిమాలకంటే ఏమాత్రం తీసిపోకుండా ఉండబోతుందట. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తుండగా మణిశర్మ చాల రోజుల తర్వాత చిరంజీవి కి సంగీతం అందిస్తుండడం విశేషం.. దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా ఇప్పటికే వచ్చినా మోషన్ పోస్టర్ మరిన్ని అంచనాలు పెంచేలా చేసింది.

ఈ సినిమా లో రామ్ చరణ్ తేజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. మొత్తంగా 20 నిముషాలు ఈ చిత్రంలో కనిపించనున్నాడట. ఈ జనవరి ఎండింగ్ లో చరణ్ షూటింగ్ లో పాల్గొననున్నాడట.. చరణ్ నాయికను ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీపై ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం.. చిరు-కొరటాల బృందం రిలీజ్ తేదీని లాక్ చేశారని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.021 మే 9న ఆచార్య రిలీజైతే సెంటిమెంటుగా అది వర్కవుట్ అవుతుందని చిరు-కొరటాల బృందం భావిస్తున్నారట. మే9 రిలీజ్ తో హ్యాట్రిక్ కొట్టాలన్న పంతం కనిపిస్తోందట.

అదే రోజున నటించిన కల్ట్ క్లాసిక్ హిట్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి(1990)- గ్యాంగ్ లీడర్(1991) మే 9న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. ఇప్పుడు ఆచార్య ను కూడా అప్పుడే రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. ఇక ఈ చిత్రంలో చరణ్ 30 రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. మర్చి వరకు షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత నిర్మాణాంతర పనులు పూర్తి చేయాలనీ కొరటాల భావిస్తున్నాడట. తొలి సినిమా నుంచి వరుస హిట్ లు చేస్తున్న కొరటాల శివ ఈ సినిమా తోనూ సూపర్ హిట్ కొట్టి మెగా కనుక ఇవ్వాలని చూస్తున్నాడట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: