నాని సినిమా కోసం కాళీ టెంపుల్.. సెట్ ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాకే..!

shami
నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో నాని సరసన కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలవనుంది. ఇక ఈ సినిమాలో కాళీ మాత టెంపుల్ సెట్ ఒకటి సినిమాకు చాలా అవసరం ఉందట.
అసలైతే సినిమాను కలకత్తాలో షూట్ చేయాలని అనుకోగా అది కుదరలేదు. అందుకే హైదరాబాద్ లోనే కాళీ మాత టెంపుల్ సెట్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సెట్ కోసమే ఆరు కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారట. టాక్సీవాలా సినిమాతో సత్త్తా చాటిన రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించబోతున్నాడు. సినిమా సెట్ కే ఆరు కోట్లు పెడుతున్నారు అంటే ఇక సినిమా బడ్జెట్ తప్పకుండా భారీగా ఉంటుందని చెప్పొచ్చు.
నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. ఇదే కాకుండా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో నాని అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. నాని సినిమాల ప్లానింగ్ చూస్తుంటే ఈ ఇయర్ వరుస హిట్లు ప్లాన్ చేసినట్టు చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: