సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ చేసిన ఎన్టీఆర్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కరోనా వైరస్ వల్ల చాలా సినిమాలు దెబ్బ తిన్నాయి  కానీ… లేదంటే ఇప్పటికే మన స్టార్ హీరోలు సినిమాలన్ని పూర్తి చేసి కొత్త సినిమాలవైపు వచ్చేసేవారు.ఇలా వాయిదా పడిన సినిమాల్లో ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ సినిమా కూడా ఒకటి. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ అభిమానుల్లో హుషారు నింపుతోంది. చాలా రోజుల క్రితమే ప్రకటించిన ఈ సినిమా ముహూర్తపు షాట్‌ తీయడానికి చిత్రబృందం డేట్ ని ఖరారు చేసిందట...

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంక్రాంతినాడు ముహూర్తం ఫిక్స్ చేశారట. టాలీవుడ్‌ నుంచి పెద్ద ఎత్తున సెలబ్రిటీలను రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్‌. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌నిస్తాడని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్‌, త్రివిక్రమ్‌తో ఉన్న పరిచయాల దృష్ట్యా పవన్‌ రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. కుటుంబ కార్యక్రమాల అంటే దూరం ఉంటాడేమో కానీ, త్రివిక్రమ్‌ అంటే పవన్‌ ఠక్కున వస్తాడనేది గత సందర్భాలు చూస్తే అర్థమవుతోంది.

గతేడాది వేసవి సందర్భంగా సినిమా ప్రారంభిస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే అలా అలా వాయిదా పడుకుంటూ ఇక్కడికి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని చిత్రబృందం తొలుత ప్రయత్నించింది. అయితే ఆ తేదీకి సినిమాను ప్రారంభిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: