వెన్నెలకంటి గారికి కన్నీటి వీడ్కోలు పలికిన ప్రముఖులు...
పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వెన్నెలకంటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎస్పీ చరణ్, ఎడిటర్ మోహన్ వెన్నెలకంటికి కన్నీటి వీడ్కోలు పలికారు. తెలుగు చలనచిత్రరంగంలో వెన్నెలకంటి ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారని, తనదైన స్టైల్లో పాటలు రాశారని చెప్పారు. ఇప్పటితరం కూడా మెచ్చే పాటలు రాయడం అయనకే చెల్లిందని కొనియాడారు. రాజేంద్రప్రసాద్ యాక్ట్ చేసిన బృందావనం సినిమాలో వెన్నెలకంటి రాసిన పాటలు అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యాయి.
అంతేకాదు, ఈ లిరిక్స్ ని ఎంతోమంది మెచ్చుకున్నారు కూడ. గజిని సినిమాలో హృదయం ఎక్కడున్నదీ పాట ఎప్పటికీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏది ఏమైనా వెన్నెలకంటి గారి మరణం ప్రేక్షకులకి తీరని లోటుగా మిగిలిపోయింది. ఇక ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...