"సోలో బ్రతుకు సో బెటర్" 10 రోజుల వసూళ్లు....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ దుమ్ముదులుపుతున్నాడుగా... ఇక రీసెంట్ గా ఈ మెగా మేనల్లుడు హీరోగా,నభా నటేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేసిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి బీభత్సమైన వసూళ్లు  వస్తున్నాయి. అదే విధంగా మౌత్ టాక్ ను రాబట్టుకుంది. దీంతో చాలా రోజుల నుండీ థియేటర్లకు  వెళ్లకుండా  ఉన్న ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడడానికి తరలి వస్తున్నారు.దీంతో  సోలోగానే ఈ చిత్రం సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. ‘సోలో బ్రతుకు’ ని జనవరి 1నుండీ ఓటిటి లో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసినప్పటికీ .. ఈ చిత్రానికి థియేటర్లలో ఆదరణ తగ్గకపోవడం విశేషం.

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి మొత్తం  రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.11.98 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఇప్పటివరకూ ఈ చిత్రం 2.3 కోట్ల వరకూ లాభాలను  కొల్లగొట్టిందని  చెప్పొచ్చు .గ్రాస్ పరంగా ఈ చిత్రం 20.2కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కి "చిత్రలహరి", "ప్రతిరోజు పండగే" సినిమాల తరువాత మంచి హాట్రిక్ హిట్ గా నిలిచింది.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: