'ఆహా' మళ్లీ హీరోగా వెన్నెల కిషోర్...!

VAMSI
2005 లో వెన్నెల సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయైన కిషోర్‌ కుమార్‌... ఆ తర్వాత క్లిక్ కాలేక ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. వెన్నెల సినిమా నిరాశపరిచింది కానీ...  తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే తన పేరుకు తగిలించుకున్నాడు. అయితే ఎంతోమంది కమెడియన్లు, విలన్ గా చేసిన నటులు హీరోలు గా మారి వారి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు మంచి సక్సెస్ ను అందుకోగా... మరికొందరు చతికిలపడ్డారు.. చాలా కొద్దిమంది మాత్రమే హీరోలుగా  రాణించారు.

అలా చూసుకుంటే కమెడియన్ సునీల్, సుధీర్, గీతాంజలి హీరో శ్రీనివాస రెడ్డి, సంపూర్ణేష్ బాబు, ఇలా ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా మారి ఆశించిన ఫలితాలు రాక తిరిగి కమెడియన్స్ గా కంటిన్యూ అవుతున్నారు. దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న కిషోర్‌, తనదైన శైలిలో హాస్యం పండిస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే మరోసారి హీరోగా మారనున్నాడు వెన్నెల కిషోర్. కాకపోతే వెండితెరపై కాదు..... ఒక వెబ్ సిరీస్ లో అది కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఒక వెబ్ సిరీస్ లో అంటూ ఇండస్ట్రీ వర్గాలనుండి టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రానాతో విరాటపర్వం సినిమాను నిర్మిస్తున్న వేణు ఉడుగుల నిర్మాణంలో ఆహా ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. వేణు స్క్రిప్ట్ అందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ వెబ్ సిరీస్ కు యువ దర్శకుడు దర్శకత్వం చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కథ లో కామెడీ ప్రధానంగా సాగే ఈ సస్పెన్స్ ఎంటర్ టైనర్ వెబ్ సిరీస్ లో వెన్నెల కిషోర్ లోని సరికొత్త కోణాన్ని చూడబోతున్నారు అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. వీలైనంత త్వరలో వెన్నెల కిషోర్ హీరోగా రూపొందుతున్న ఆ వెబ్ సిరీస్ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ వెన్నెల కిషోర్ కు ఎటువంటి గుర్తింపు తెస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: