అల్లరి నరేష్ కి గట్టి దెబ్బ తగిలిందిగా....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ప్రతి సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది.చాలా వరకు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేవి కావు కానీ ఒక విదంగా యావరేజ్ హిట్ అన్న అయ్యి ఆకట్టుకునేవి. ఇక హిట్ టాక్ వస్తే కథ వేరేలా ఉండేది. కానీ అల్లరి నరేష్ ఇటీవల కాలంలో మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. సుడిగాడు సినిమా తరువాత ఒక్క హిట్టు కూడా లేదు.ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చిన నరేష్ మెల్లగా ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమానే చేస్తున్నాడు.

ఈ ఏడాది సినిమా రాలేదు. 2019లో అయితే హీరోగా సినిమానే రాలేదు. మహర్షి సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో మాత్రమే కనిపించాడు. ఇక మరో షాకింగ్ విషయం ఏమిటంటే నరేష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 17ఏళ్లవుతోంది. ఇంతవరకు తన కెరీర్ లో వెండితెరపై కనిపించని ఏడాదే  లేదు.ఈ సంవత్సరం అతిపెద్ద గ్యాప్ వచ్చింది.2020లో రావాలని అనుకున్నాడు కానీ కరోనా వైరస్ వల్ల కుదర్లేదు. ఇక 2021 సంక్రాంతికి హిట్ కొట్టాలని బంగారు బుల్లోడు సినిమాతో రాబోతున్నాడు. అలాగే నాంది అనే సినిమాతో కూడా డిఫరెంట్ గా ఆకట్టుకోవాలని వచ్చే ఎండాకాలాన్ని టార్గెట్ చేస్తున్నాడు. 

ఈ రెండు సినిమాలపై నరేష్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ముఖ్యంగా నాంది తప్పకుండా తన కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని కూడా చెబుతున్నాడు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో  చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: