నాగ్ అశ్విన్ ప్రభాస్ ని ఎలా ఒప్పించాడో తెలుసా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అందులో అన్నిటికంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా నాగ్ అశ్విన్ తో చెయ్యబోయే సినిమా. ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. మహానటి లాంటి "మాస్టర్ పీస్" చిత్రాన్ని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్..అందులో సావిత్రమ్మగారి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక తన తదుపరి సినిమా ప్రభాస్ తో చెయ్యాలని అనుకున్నాడు. ఇక ప్రభాస్ ని ఎలా ఒప్పించాడంటే.. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాకి ముందు నుండే నాగ్ అశ్విన్ ఈ కాన్సెప్ట్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు.

అలా తన మనసులో అనుకున్న ఒక పాయింట్ ని డెవలప్ చేసి ఓ షేప్ తీసుకొచ్చాడు. ‘మహానటి’ సినిమా సక్సెస్ తరువాత, తన మైండ్ లో కొన్నేళ్లుగా నలుగుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడట. మూడు నెలల పాటు కూర్చొని తన ఆలోచనకు కథారూపం ఇచ్చాడు. ఆ తరువాత హీరోగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో.. ప్రభాస్ కి మాత్రమే తన కథను హ్యాండిల్ చేయగల సత్తా ఉందని భావించి.. అశ్వనీదత్ సహకారంతో కథ వినిపించాడట.

కథ విన్న ప్రభాస్ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పాడట. ఆ తరువాత అమితాబ్ బచ్చన్ ను, దీపికా పదుకోణెను కలిసి సింగిల్ సిట్టింగ్ లో ఒప్పించాడట నాగ్ అశ్విన్.కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని రికార్డులు తిరగరాస్తుందని చాలా నమ్మకంగా వున్నారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం "రాధే శ్యామ్" సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా టీజర్ సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: