ఉపేంద్ర రాజకీయాలకు త్రివిక్రమ్ సపోర్ట్ !
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తున్నాను అంటూ తన అభిమానులకు ఆశపెట్టి చివరి నిముషంలో తనను రాజకీయాలలోకి వెళ్ళవద్దని దేవుడు ఆదేశించాడు అంటూ ఒక షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రజినీకాంత్ ఇలాంటి ప్రకటన చేయకముందే కన్నడ హీరో ఉపేంద్ర కూడ ఇలాగే వ్యవహరించాడు.
కొన్ని సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉపేంద్ర ఒక రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించి కర్ణాటక రాజకీయాలలో ఒక కొత్త శఖం సృష్టిస్తాను అంటూ చాల ఆవేసపూరితమైన ప్రశంగం చేసాడు. అయితే తన పార్టీ మొదటి సమావేశంలో తన అభిమానులు వర్గాలుగా విడిపోయి ఒకేసారి గందరగోళం జరగడంతో కోపగించుకున్న ఉపేంద్ర తన పార్టీని క్యాన్సిల్ చేసి తాను రాజకీయాలకు పనికిరాను అని చెపుతూ ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేసుకుంటున్నాడు.
అయితే ఇప్పుడు రాజకీయాల పట్ల ఉపేంద్ర కు ఉన్న ఆశక్తి గ్రహించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఉపేంద్ర కోరికను తీర్చేపనిలో బిజీగా ఉన్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న మూవీలో ఉపేంద్ర నెగిటివ్ షేడ్ లో ఉండే రాజకీయనాయకుడు పాత్రలో కనిపిస్తాడని టాక్.
‘పోయిరావలె హస్తినకు’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకోబోయే ఈ మూవీ కథ అంతా రాజకీయాల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. హీరోతో సరిసమానమైన విలన్ పాత్రగా ఉపేంద్ర పాత్రను త్రివిక్రమ్ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గతంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీలో ఉపేంద్ర నటించిన దగ్గర నుండి త్రివిక్రమ్ ఉపేంద్రల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. ఆ సాన్నిహిత్యంతో త్రివిక్రమ్ ఉపేంద్ర బాడీ లాంగ్వెజ్ దృష్టిలో పెట్టుకుని ఈ పవర్ ఫుల్ నెగిటివ్ పాత్రను క్రియేట్ చేసినట్లు టాక్. రాజకీయాల పై త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగ్స్ ఈ మూవీకి హైలెట్ అని అంటున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ 2022 సంక్రాంతి రేస్ కు వస్తుంది అని అంటున్నారు..