అక్కడ అదరగొడుతున్న నిహారిక...పెళ్లి తర్వాత కూడా అస్సలు తగ్గట్లేదుగా..??

Anilkumar
మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం తన భర్తతో హానీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఈమె..ఓ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదట..పూర్తి వివరాల్లోకి వెళితే..  ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న నిహారిక తరచూ తన షోలు, ప్రోగ్రాములు, వ్యక్తిగత జీవితంపై అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. కళ్లు చెదిరే చీరల్లో కనిపిస్తున్న నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికా సరికొత్తగా కనిపిస్తోంది. అంతేకాదు మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించిన నిహారిక.. పలు వెబ్ సిరీస్ లతో సందడి చేసింది. టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక వెస్ట్రన్ వేర్ తో పాటు చీరల్లో కనిపిస్తూ మెగా అభిమానులను అలరిస్తుంటారు.

ఈ నెల 9న నిహారిక పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. ఈ పెళ్లిలో నిహారిక 32 ఏళ్ల నాటి తన తల్లి పెళ్లి నాటి చీరలో మెరిసిపోయింది. దానికి సంబంధించిన నిహారిక పోస్ట్ చేసిన ఫొటో ఏకంగా 504,148 లేకులు కొల్లగొట్టిందంటే ఎంత అందంగా నిహారికా ఈ చీరకట్టులో కనిపించారో అర్ధం చేసుకోవచ్చు.ఆ తర్వాత నిహారిక కళ్లు చెదిరేలా కనిపించే బంగారు వర్ణం కంచి పట్టుచీరలో నిహారికా కనిపించి కనువిందు చేసారు. చైతన్యను మనువాడే సమయంలో ఈమె అత్యంత ఖరీదైన చీరతో సరికొత్తగా కనిపించారు.కోడలిగా మెట్టింట వంట చేస్తూ...

 జొన్నలగడ్డ వారింట అడుగు పెట్టిన నిహారిక ఈ సందర్భంగా తీసుకున్న ఫొటో కూడా చాలా బాగుందని మెగా అభిమానులు ప్రశంసలు కురిపించారు. సింపుల్ చీర కట్టుకుని, సంప్రదాయకరంగా కనిపిస్తున్న నిహా.. తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.మంచి డిజైనర్ వేర్ చీరలతో పాటు వాటికి తగ్గట్టు, ట్రెండీగా కనిపించేలా సూటబుల్ యాక్సెసరీస్ ధరించే మెగా ప్రిన్సెన్ నిహారిక వావ్ అనిపించేలా బొటిక్ డిజైన్ బ్లౌజులు ధరిస్తూ, తన ఫ్యాషన్ టేస్ట్ ను ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటుంది ఈ మెగా వారమ్మాయి.. ఇక ప్రస్తుతం నిహారిక తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది..వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: