సాయి పల్లవి డామినేషన్ కు కీర్తి సురేష్ మైండ్ బ్లాంక్ !

Seetha Sailaja
‘మహానటి’ మూవీ తరువాత కీర్తి సురేష్ జాతీయ స్థాయి ఉత్తమనటి పురస్కారం పొందడంతో ఇక ఆమె కెరియర్ కు తిరుగులేదు అని అనుకున్నారు అంతా. దీనికి తగ్గట్టుగా ఆమెకు అనేక సినిమాలలో టాప్ హీరోల పక్కన అవకాశాలు రావడంతో పాటు భారీ బడ్జెట్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా మారింది.


అయితే ఆమె నటించిన ‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ ఫెయిల్ కావడంతో ఆమె తన రూట్ మార్చుకుని ఇప్పుడు గ్లామర్ క్వీన్ గా మారి మహేష్ పక్కన ‘సర్కారు వారి పాట’ లో నటిస్తోంది. ఇప్పుడు కీర్తి సురేష్ మ్యానియా సాయి పల్లవి కి వచ్చిందా అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.  


ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. ఈ 5 సినిమాలు కూడ మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆమె ఇప్పటికే నాగచైతన్య హీరోగా ‘లవ్ స్టోరీ’ సినిమాను పూర్తి చేసింది. ఈ మూవీతో పాటు ఆమె నటించిన ‘విరాటపర్వం’ విడుదలకు రెడీగా ఉంది. ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాకుండానే
నానితో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీని మొదలు పెట్టింది.


నిన్నటిరోజున మొదలైన పవన్ ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ లో సాయి పల్లవి హీరోయిన్ ఈ  సినిమాలు చాలవు అన్నట్లుగా ఈమెకు మరొక క్రేజీ ఆఫర్ పచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణవంశీ గోపీచంద్ కాంబినేషన్ లో రాబోతున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ ప్రాజెక్టులో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారు. ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అన్న ప్రచారం జరుగుతోంది. ముందుగా ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ ను సంప్రదించి ఆతరువాత ఆమె నిర్ణయం ఇంకా తెలియచేయకుండానే సాయి పల్లవిని ఫైనల్ చేసారు. దీనితో రానున్న రోజులలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు అదేవిధంగా నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రలకు టాలీవుడ్ లో సాయి పల్లవి చిరునామాగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: