నేనొక పెద్ద కాట్రాజ్.. ఎవ్వరిని వదలను.. నిజం ఒప్పుకున్న సుధీర్..?

praveen
బుల్లితెరపై సుడిగాలి సుదీర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో ఒక సాదాసీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత ఏకంగా  జబర్దస్త్ లో టీం లీడర్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగుతున్న సుడిగాలి సుదీర్ ఇటీవలే వెండితెరపై కూడా అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే.


ప్రస్తుతం ఈ టీవీ లో ఏ షో వచ్చినా కూడా ఆ షోలో సుడిగాలి సుదీర్ కీలకంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతున్నాడు. సుడిగాలి సుదీర్  షో లో ఉన్నాడు అంటే ఆ షో లో  ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుంది అని అటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ టీవీ లో ఏ  షో  జరిగిన ఏ ఈవెంట్  జరిగినా కూడా అందులో సుడిగాలి సుదీర్ పాత్ర కీలకం గా మారిపోతుంది. ఇటీవలే ఈ టీవీ యాజమాన్యం న్యూ ఇయర్  సందర్భంగా కొత్త ఈవెంట్ ప్లాన్ చేసేది.. ఢీ.. జబర్దస్త్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ జడ్జీలు అందరితో కలిపి న్యూ ఇయర్ ఈవెంట్ ప్లాన్ చేశారు.



 దీనికి సంబంధించి ఇటీవలే విడుదలైన ప్రోమో వైరల్ గా మారిపోయింది. అయితే సాధారణంగా  సుధీర్ ని అందరూ ఆటపట్టిస్తూ పంచులు వేస్తూ ఉంటారు.. అంతే కాదు సుధీర్ ఒక కాట్రాజ్ అంటూ పంచ్ వేసి అందరిని నవ్విస్తూ ఉంటారు. కానీ ఇటీవలే విడుదలైన ప్రోమో లో మాత్రం సుధీర్ తాను పెద్ద కాట్రాజ్ అని ఎవరిని వదలను అంటూ ఒప్పుకున్నాడు. స్కిట్ చేస్తున్న సమయంలో నేను  పెద్ద కాట్రాజ్  ఎవరిని వదలను అంటూ సుధీర్ డైలాగ్ చెప్పడంతో షో లో ఉన్న అందరూ కూడా పగలబడి నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: