శ్రీవిష్ణు కు అదృష్టం వరించనుందా?

Divya

తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చిన్న చిన్న పాత్రలకే పరిమితమవుతూ, వారి నటనతో దర్శకులను మెప్పించగల సామర్థ్యమూ కలిగిన కొంతమంది హీరోలు, ఆ తరువాత కథానాయకులుగా వచ్చి భారీ విజయాలను సాధిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అదే బాటలోనే శ్రీ విష్ణు కూడా నడుస్తున్నాడు. 2009వ సంవత్సరంలో బాణం, సోలో లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించి, ప్రేక్షకులను సైతం మెప్పించాడు.

ఆ తరువాత 2013వ సంవత్సరంలో ప్రేమ ఇష్క్ కాదల్,  సెకండ్ హ్యాండ్ మూవీ కథానాయకుడిగా నటించి అందులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా 2016వ  సంవత్సరంలో "అప్పట్లో ఒకడుండేవాడు" సినిమాలో నటించి మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.2017 లో ఉన్నది ఒక్కటే జీవితం చిత్రంలో రామ్ కు మంచి  స్నేహితుడు గా నటించి,  స్నేహ బంధానికి విలువ ఏంటో నిరూపించాడు.

వరుస హిట్లతో చివరికి 2019లో బ్రోచేవారెవరురా, తిప్పరామీసం ఇలాంటి సినిమాలలో నటించి,తన మాతృభాషను పునికి పుచ్చేలా నటించగలిగాడు. ఎంతో విలక్షణ నటనతో, విభిన్న పాత్రలలో నటించి అభినయానికి తగ్గ అన్ని పాత్రలలో నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఎంతో ఆసక్తికరమైన సినిమాలను అంగీకరిస్తూ ప్రేక్షకులలో విభిన్న పాత్ర ధారిగా  పేరు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం "రాజ రాజ చోళ" సినిమా షూటింగ్ పూర్తయింది.

అంతేకాకుండా మరో వైపు గాలి సంపత్ సినిమాలో నటిస్తూనే,మరోవైపు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పటికి మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీ విష్ణు మరో సినిమా తీయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటి వరకు చేయని పాత్రలో శ్రీ విష్ణు యాక్షన్, ఎమోషనల్ పాత్రలో నటించబోతున్నారు.అంతేకాకుండా టాప్ టెక్నిషియన్ లు సినిమాలో నటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని చిత్రబృందం యూనిట్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: