బిగ్ బాస్ లో దయ్యాన్ని చూసి వారం రోజులు లేవలేదు.. దివి షాకింగ్ కామెంట్స్..?
అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ కాస్త పెంచింది అనే చెప్పాలి. ఇక అందం అభినయం ఆకర్షించే రూపం ఉన్న ఈ ముద్దుగుమ్మ ఏడో వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగి ఏడవ వారం ఎలిమినేట్ అయింది. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరు అయిన దీవి.. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో దయ్యాన్ని చూసి భయపడి పోయానని ఇక వారంరోజుల పాటుబెడ్ కే పరిమితం అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఓసారి నడుస్తూ ఉన్న సమయంలో చూసుకోకుండా స్వాతి దీక్షిత్ అద్దానికి గట్టిగా గుద్దుకుందని ఈ క్రమంలోనే ఫేస్ మొత్తం గ్లాస్ మీద ప్రింటెడ్ లా వచ్చేసింది అని చెప్పింది. ఆమె మేకప్ మొత్తం అద్దంపై ప్రింట్ పడిపోయిందని.. అయితే ఓ రోజు రాత్రి పడుకుంటున్న సమయంలో చీకట్లో అద్దం వైపు చూడగానే అక్కడ కళ్ళు ముక్కు పెదాలు తో ఒక దయ్యంలా కనిపించడంతో హడలిపోయి దెబ్బకి ఫీవర్ వచ్చింది అంటూ తెలిపింది. ఆ రోజు నైట్ డాక్టర్లు కూడా వచ్చారని.. ఇక వెంటనే అమ్మ నాన్న దగ్గరికి పంపించేయాలి అంటూ ఎంతగానో ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇదంతా కెమెరాలలో చూపించలేదు అంటూ తెలిపింది.