శంకర్ దాదా MBBS సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు..!!

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి నటించిన "శంకర్ దాదా MBBS " సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఎందుకంటే మెగాస్టార్ నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో ఇదీ ఒకటి కాబట్టి. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా సినిమాలో చిరూ కామెడీ టైమింగ్ ,దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్, ATM అనే క్యారెక్టర్ లో హీరో శ్రీకాంత్ నటన... ఇవన్నీ సినిమాకు హైలైట్ గా నిలవడంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ.. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఓ బుడ్డోడు నటించాడు..సాధారణ ప్రేక్షకులకు అంత గుర్తులేకపోయినా.. ఇదే విషయాన్ని మెగా అభిమానులను అడిగితే హాస్పిటల్‌లో వీల్‌చైర్‌లో కనిపించిన కుర్రాడే కదా' అంటారు.ఆ కుర్రాడు ఇప్పుడు హీరో అయ్యాడని తెలుసా? అంతేకాదు హాట్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ప్రియుడిగా ఓ సినిమా నటిస్తున్నాడనీ తెలుసా?

ఇంతకీ ఎవరా కుర్రాడు అంటే..." శంకర్‌దాదా ఎంబీబీఎస్‌'లో అచేతనంగా కుర్చీలో కనిపించే కుర్రాడు శ్రీరామచంద్రమూర్తిని మరచిపోవడం ఎవరితరమూ కాదు. సినిమాలో సీరియస్‌నెస్‌ తెచ్చిన ఎలిమెంట్స్‌లో శ్రీరామచంద్రమూర్తి ఎపిసోడ్‌ ఒకటి. సినిమా ఆఖరులో అందరి మనసుల్ని బరువెక్కించే పాత్ర అది. ఆ పాత్రలో నటించిన కుర్రాడిని అప్పుడు చూసి… ఈ ముఖంలో 'మెగా' కళ కనిపిస్తోంది అని అనుకున్నారు. అయితే మెగాస్టార్‌ సినిమా కదా ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది అని వదిలేశారు.అయితే ఆ పాత్రలో నటించి మెగా ఇంటి కుర్రాడే.ఆ బుడ్డోడు మరెవరో కాదు.. మన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్..

  'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్నాడు వైష్ణవ్.. ఇప్పటికే ఈ సినిమా పాటలకి విశేష స్పందన లభించింది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది ఈ సినిమా.. ఈ సినిమా తర్వాత  క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఏకంగా  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తో రొమాన్స్ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్..ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది రకుల్ ప్రీత్..ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు లాక్ డౌన్ లోనే పూర్తయినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: