సప్తగిరి కొత్త సినిమా పోస్టర్ విడుదల...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సప్తగిరి అనేక తెలుగు సినిమాలలో నటించి మంచి  హాస్యనటుడిగా తనకంటూ ఒక  ప్రత్యేకమైన  గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా పీక్స్ స్టేజిలో వున్నప్పుడు  హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరోగా మారిన సప్తగిరి.. ఆ తరవాత ‘సప్తగిరి ఎల్ఎల్‌బి’, ‘వజ్రకవచధర గోవింద’ సినిమాల్లో హీరోగా నటించాడు. ఒకవైపు కమెడియన్‌గా నటిస్తూనే మరోవైపు హీరోగా సినిమాలు చేస్తు ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తూ మంచి ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సప్తగిరి. ఇది బహుభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఖుషి సహ నిర్మాతగా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నాడు.ఎన్‌.ఎస్‌. ప్రసు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి న‌జీర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, వంశీ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వర‌లో వెల్లడించ‌నున్నారు. ఇదిలా ఉంటే, చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తోన్న ‘సూపర్ మచ్చి’ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సుందరి, పూర్ణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘ఎయిట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

టైటిల్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. యూనివ‌ర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ కావ‌డం వ‌ల్లే నాలుగు భాష‌ల్లో నిర్మిస్తున్నామని నిర్మాత రిజ్వాన్ వెల్లడించారు. ఇల్యూజ‌న్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు సూర్యాస్ దర్శకత్వం వహించనున్నారు. స‌ప్తగిరికి ఉన్న ఇమేజ్‌కు త‌గిన‌ట్లు చిత్రంలో వినోదానికి పెద్దపీట వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభించ‌నున్నట్లు పోస్టర్‌లో వెల్లడించారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విశేషాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: