అల్లు అర్జున్ చరణ్ జూనియర్ లపై సంపూర్ణేష్ ను ప్రయోగిస్తున్న ప్రేమ్ రక్షిత్ !
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ కొంతకాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం. తెలుగులో సెటైరికల్ మూవీలను తీసి విజయం సాధించ వచ్చు అన్నవిషయం సంపూర్ణేష్ సినిమాల ద్వారా ఋజువు అయింది. గతంలో అతడు నటించిన ‘హృదయకాలేయం’ ‘కొబ్బరిమట్ట’ సినిమాలు బాగా హిట్ అవ్వడమే కాకుండా ఈమూవీలను నిర్మిచిన నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.
ఇతడి పాపులారిటీ గ్రహించిన బిగ్ బాస్ నిర్వాహకులు గతంలో ఇతడిని బిగ్ బాస్ షోలోకి ఎంటర్ చేసినా అక్కడి పరిస్థితులకు తాట్టుకోలేక షో మధ్యలోనే తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత సంపూ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. లేటెస్ట్ గా ఈహీరో ‘బజార్రౌడీ’ అనే మూవీ చేస్తున్నాడు. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత సంది రెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈమూవీని వసంత నాగేశ్వరరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంపూర్ణేష్ జోడీగా మహి నటిస్తోంది.
షాయాజీ షిండే పృథ్వీ లు నటిస్తున్నారు కత్తి మహేష్ ఈ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలకు ప్రముఖ కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూర్చడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ సంపూ తో వెరైటీ డాన్స్ లు చేయిస్తున్నట్లు టాక్.
అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రామ్ వంటి టాప్ హీరోలకు గతంలో స్టెప్ లు కంపోజ్ చేసే ప్రేమ్ రక్షిత్ సంపూర్ణేష్ సినిమాకు పని చేయడం చూస్తుంటే సంపూ ద్వారా తాను ఎవరినైనా మంచి డాన్సర్ గా మార్చగలను అన్న మెసేజ్ ప్రేమ్ రక్షిత్ ఈ టాప్ హీరోలకు ఇస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ విజయవంతం అయితే మళ్ళీ సంపూ మార్కెట్ పుంజుకునే ఆస్కారం ఉంది. అయితే ఈ మూవీని ధైర్యం చేసి ధియేటర్లలో విడుదల చేస్తారా లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేస్తారా అన్నవిషయం రానున్న రోజులలో తెలియనున్నది..