విక్టరీ వెంకటేష్ బాబాయ్ కూడా హీరో అన్న విషయం మీకు తెలుసా..??

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. కాస్తో కూస్తో అదృష్టం కూడా ఉండాలి. అలా అయితేనే ఇండ్రస్టీలో హీరోగా ఎదగగలరు. ఒక్క హిట్టు పడ్డ హీరోకి వరుసగా రెండు ప్లాపు లు వచ్చాయంటే చాలు.. కొంత సమయం వరకు ఆ హీరో పేరు కూడా ఇండ్రస్టీ లో మళ్ళీ వినబడదు. అలాంటి హీరోలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇక అగ్ర హీరోల ఫ్యామిలీస్ నుంచి వచ్చినవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఏదో స్టార్ హీరో ఫ్యామిలీ నుండి వచ్చాడు కదా.. సపోర్ట్ చేద్దాం అనే ఆలోచన ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే ఇండ్రస్టీ లో పోటీతత్వం అనేది అలా ఉంది. ఎక్కడ అతడిని సపోర్ట్ చేస్తే మనల్ని మించిపోతాడేమో అనే భయం మిగతా నటులలో కచ్చితంగా ఉంటుంది.

అలా స్టార్ స్టేటస్ ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో పరిస్థితి కూడా ఇదే విధంగా మారిపోయింది. అతడు మరెవరో కాదు దగ్గుబాటి రాజా. ఇప్పటి తరానికి యితడు ఎవరో తెలియక పోవచ్చు కానీ, అప్పట్లో రచయిత సత్యానంద్ దర్శకత్వం వహించిన ఝాన్సీరాణి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రాజా మంచి పేరే తెచ్చుకున్నా ఎందుకో నిలబడలేదు.నిజానికి పాక్కు వేతలై అనే తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రాజా,తమిళంలో అప్పుడప్పుడు కనిపించినా, తెలుగులో మాత్రం నిలదొక్కుకోలేదు. దగ్గుబాటి రామానాయుడికి దగ్గర బంధువు అయిన రాజా వరుసకు వెంకటేష్ కి బాబాయ్ అవుతాడు.అప్పట్లో రాజా నటించిన పలు సినిమాలకు రామానాయుడు సహ నిర్మాతగా కూడా వ్యవహరించి ఎంకరేజ్ చేసారు.

ఇక 2019లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మూవీస్ లో కీలక పాత్రలో దగ్గుబాటి రాజా కన్పించాడు. అలాగే తమిళంలో ఆదిత్యవర్మ మూవీలో కూడా ఫాథర్ క్యారెక్టర్ వేసి, మెప్పించాడు.ఇప్పటికీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అలా మన వెంకటేష్ బాబాయ్ అయిన దగ్గుబాటి రాజా ఇండ్రస్టీ లో హీరోగా అవకాశాలు వచ్చినా.. దురదృష్టవశాత్తు ఆ స్థానాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాడు.అదే దగ్గుబాటి ఫ్యామిలీ లో సీనియర్ అగ్ర నటుడిగా వెంకటేష్.. యంగ్ హీరోగా రానా మరియు అగ్ర నిర్మాతగా సురేష్ బాబు ఇండ్రస్టీ లో కొనసాగుతూ ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: