కమల్.. రజినీ ప్లాన్ ఏంటో తెలిస్తే..!
కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటే.. ముందు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలి. అందుకే.. కమల్ విక్రమ్, భారతీయుడు2ను.. రజనీ అన్నాత్తే సినిమాను ఫినిష్ చేస్తారు. వీటిని తమిళనాడు ఎలక్షన్స్‌కు ముందు రిలీజ్ చేస్తే.. రాజకీయంగా లబ్ది పొందవచ్చనే ఫీలింగ్‌లో ఉన్నారు ఈ సూపర్‌స్టార్స్.
కమల్‌హాసన్ అదిరిపోయే హిట్ కొట్టి చాలా సంవత్సరాలైంది. యాక్టర్‌గా ఫేడౌట్ అయిపోయిన టైంలో విక్రమ్ టీజర్ క్రేజ్ తీసుకొచ్చి.. కొత్త ఆశలు పూయించింది. ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ మూవీని ముందు ఫినిష్ చేసి.. భారతీయుడు2ను కూడా మొదలుపెట్టేస్తాడట. క్రేన్ ప్రమాదంలో ముగ్గురు చనిపోయవడంతో భారతీయుడు2 షూటింగ్ ఆగిపోయింది. శంకర్ మూవీ అంటే మెసేజ్ కంపల్సరీ. ఇది తన పొలిటికల్ కెరీర్‌కు ఉపయోగపడుతుందన్న నమ్మకంతో.. కమల్ వున్నాడట. మొదలవుతుందా? లేదా? అని డైలమాలో వున్న భారతీయుడు2ను నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్.
2021లో తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్‌కు ఆరునెలలు మాత్రమే టైం వుంది. మరోవైపు ఆయన నటిస్తున్న అన్నాత్తే మూవీ సెట్స్‌పై ఉంది. ఎన్నికలు ముందే అన్నాత్తేను థియేటర్స్‌లోకి తీసుకురావాలని రజనీ ప్రయత్నిస్తున్నాడట.
పవన్, చిరంజీవి ఓ సందర్భంలో ఈ జీవితం ప్రజా జీవితానికే అంకితమంటూ.. యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పారు. రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయిన మెగా బ్రదర్స్ మళ్లీ కెమెరాముందుకు వచ్చారు. వీళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో తమిళ స్టార్స్ జాగ్రత్తపడ్డారనుకుంట. సినిమాలకు గుడ్‌బై చెప్పలేదు. చేతిలో వున్న సినిమాలు పూర్తి చేసి... రిలీజ్ చేయాలి. పొలిటికల్‌గా లాభపడాన్న లక్ష్యంతో ఉన్నాడు ఈ తమిళ తంబీలు.