ప్రభాస్ సలార్ లో భళ్లాలదేవా..?

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు కమిటవుతూ వెళ్తున్నాడు. మరి ఈ సినిమాలన్ని ఎప్పుడు పూర్తి చేస్తాడు అన్నది మాత్రం తెలియాలి. రాధే శ్యాం పూర్తి కాగానే ఆదిపురుష్ సినిమా లైన్ లో ఉంది. జనవరి నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇదే కాకుండా నాగ్ అశ్విన్ సినిమా కూడా చేయాల్సి ఉంది. అయితే అంతకుముందే సలార్ అంటూ కె.జి.ఎఫ్ డైరక్టర్ తో క్రేజీ సినిమా ఎనౌన్స్ చేశాడు ప్రభాస్. సలార్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ తోనే సినిమా స్టామినా ఏంటో చూపించాడు ప్రశాంత్ నీల్.

ప్రభాస్ సలార్ సినిమా కూడా నేషనల్ వైడ్ రిలీజ్ అవనుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా స్టార్ హీరోలు ఇద్దరు నటిస్తారని టాక్. అందులో ఒకరు మోహన్ లాల్ కాగా మరొకరు రానా అని తెలుస్తుంది. బాహుబలి సినిమాలో భళ్లాలదేవాగా మెప్పించిన రానా మరోసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అని తెలుస్తుంది. అంతేకాదు మళయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ప్రభాస్ సలార్ లో ఉంటాడని తెలుస్తుంది. ఈ ఇద్దరు ఉంటే ప్రభస్ సలార్ కు మరింత క్రేజ్ వస్తుందని చెప్పొచు.

కె.జి.ఎఫ్ కు ముందు యశ్ ఎవరో తెలుగు ఆడియెన్స్ కు తెలియదు అలాంటి యశ్ తోనే కె.జి.ఎఫ్ లాంటి సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టరే అదుర్స్ అనిపించగా సినిమా వేరే లెవల్ లో ఉంటుందని అంటున్నారు.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: