ఉమామహేశ్వర రేటు పెంచాడట..!

shami
కరోనా లాక్ డౌన్ టైం లో స్టార్ హీరోలు సితం తమ సినిమాలను రిలీజ్ చేయకుండా ఉండగా యువ హీరో సత్యదేవ్ మాత్రం సినిమాలు చేస్తూ వాటిని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. వెబ్ సీరీస్ లతో పాటుగా అతను చేసిన సినిమాలు ఓటిటిల్లో రిలీజ్ అయ్యాయి. అందులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా సూపర్ హిట్ అవడంతో సత్యదేవ్ గురించి అందరు మాట్లాడుకునేలా చేసింది.
పూరీ జ్యోతిలక్ష్మి సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన సత్య దేవ్ ఆ తర్వాత హీరోల పక్కన ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. కొన్ని సినిమాల్లో రిజిస్టర్ అయ్యే పాత్రలే చేసినా సోలోగా చేసిన ప్రయత్నాల్లో ఉమామహేశ్వర మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు సత్య దేవ్. ఇప్పటికే గుర్తుందా శీతాకాలం సినిమా చేస్తున్న సత్య దేవ్. ఓ పక్క తిమ్మరుసు అంటూ మరో క్రెజీ మూవీ చేస్తున్నాడు.
అంతేకాదు ఈమధ్య తన రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకు కోటి, కోటిన్నర దాకా సత్యదేవ్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగు అతని మార్కెట్ పెరిగింది కాబట్టి నిర్మాతలు కూడా అతను అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఫైనల్ గా సత్య దేవ్ సూపర్ ఫాం లో ఉన్నాడని అర్ధమవుతుంది. ఇవేకాకుండా ఆల్రెడీ డిస్కషన్స్ లో కూడా ఓ రెండు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాలతో సత్య దేవ్ తన సత్తా చాటేలా ఉన్నాడని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: