అనుష్క చేసిన ఆ పనికి ... నిజంగా చెయ్యెత్తి మొక్కినా తక్కువే ....??
ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి గొప్ప విజయాలు అందుకుని అందులో హీరోయిన్ గా నటించిన అనుష్క కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక వాటి అనంతరం ఆమె నటించిన భాగమతి సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి యువ దర్శకుడు అశోక్ దర్శకత్వం వహించగా జయరాం ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఇటీవల అనుష్క నటించిన సినిమా నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ తీసిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కొద్దిరోజుల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది.
ఇక ప్రస్తుతం పలు సినిమాల కథలు వింటున్న అనుష్క, త్వరలో బాలీవుడ్ లో రిలీజ్ కానున్న దుర్గామతి సినిమా కోసం తనవంతుగా ప్రమోషన్ చేయడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క నటించిన భాగమతి సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని కూడా అశోక్ తెరకెక్కించగా ఇందులో ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి భూమి ఫడ్నేకర్ నటించింది. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని, అలానే టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ కొద్దిరోజుల నుండి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆ మూవీని అనుష్క ప్రమోట్ చేస్తున్న విధానానికి పలువురు ప్రేక్షకులు, అభిమానులు ఆమె గొప్పతనాన్ని మెచ్చుకుంటూ మీకు నిజంగా చెయ్యెత్తి మొక్కినా తక్కువే మేడం అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!