నాగార్జున పైతీవ్ర స్థాయిలో మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా..??
అందుకు కారణం అభిజిత్ అనే చెప్పాలి. ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో నాల్గువ సీజన్ పన్నెండో వారం పూర్తి కాబోతోంది. అయితే నిన్న శనివారం కావడంతో.. నాగార్జున వచ్చి ఇంటి సభ్యులతో ముచ్చటించారు.అలాగే ఈ వారం హౌస్ మేట్స్ ఎవరేమి తప్పులు చేశారో ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అభిజిత్‌కు నాగార్జున ఫుల్ క్లాస్ పీకారు. ఇంటి సభ్యులందరినీ ఏం తప్పులు చేశారని ప్రశ్నించిన నాగ్.. అభిజిత్ వంతు వచ్చే సరికి బిగ్‌బాస్ గేట్లు తెరవండి అంటూ అందరినీ షాక్‌కు గురిచేశారు.అనంతరం అభిజిత్ తప్పుల చిట్టాను నాగ్ బయటపెట్టారు.ఈ క్రమంలోనే అభి టాస్కు చేయలేదని నాగార్జున నిర్మొహమాటంగా చెప్పేశాడు. అలాగే కొన్ని వీడియో చూపిస్తూ.. అతడికి క్లాస్ పీకారు.
అయితే ఈ విషయంలోనే నాగార్జునను అభిజిత్ అభిమానులు మరియు పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంత సీరియస్ గా నాగ్ అభిజిత్ ను మందలించాల్సిన అవసరం ఏంటని, కావాలనే అతడిని టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టాప్ టార్గెటింగ్ అభి అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా నాగార్జునను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి అభిజిత్ వల్ల మన నాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి కావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోందనే చెప్పాలి...!!