ఆ రెండు తప్పులే 'ఖలేజా' మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం .....??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు సినిమా 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ నటుడు మురళీమోహన్ తన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా సోనూసూద్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా పలు ఎమోషనల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ కూడా టీవీలో ప్రదర్శితం అయితే దానికి భారీ స్థాయిలో రేటింగ్స్ వస్తూ ఉంటాయి.

ఇక ఈ సినిమా అనంతరం మరొకసారి మహేష్ తో త్రివిక్రమ్ చేసిన సినిమా ఖలేజా. సింగనమల రమేష్ బాబు, సి.కళ్యాణ్ నిర్మాతలుగా కనకరత్న మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విధంగా భారీ ఫ్లాప్ గా నిలిచింది. అంతకు ముందు వరకు కొంత యాక్షన్ ఎమోషనల్ స్టైల్లో యాక్టింగ్ కొనసాగించిన మహేష్ బాబు ఒక్కసారిగా ఈ సినిమాతో తనలోని పూర్తి కామెడీ యాంగిల్ బయటకు తీసి ప్రేక్షకులను అలానే అభిమానులను ఎంతో అలరించారు. ఇక ఈ సినిమా కూడా ఇప్పటికీ అటు యూట్యూబ్ తో పాటు ఇటు టీవీలో ప్రదర్శితమై మంచి రేటింగ్స్ ని వ్యూస్ ని దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఇప్పటికీ అర్థం కాదని ఎందరో మహేష్ బాబు అభిమానులు అలానే ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ విషయమై కొందరు రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

వాటి ప్రకారం మొదటగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని గనక పరిశీలిస్తే అది ఎంతో యాక్షన్ స్టైల్లో సాగుతూ ఉండటంతో ఎక్కువ మంది ప్రేక్షకులు అభిమానులు ఈ సినిమాని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా అంచనాలు పెట్టుకున్నార ని, మరోవైపు అప్పటివరకు మహేష్ బాబు లో చూడని పూర్తి స్థాయి కామెడీ యాంగిల్ ని ఒక్కసారిగా సినిమాలో చూపించి అందర్నీ థ్రిల్ చేసిన త్రివిక్రమ్, అందులోని ఒక సన్నివేశాన్ని అయినా టీజర్ లో కనక పొందుపరిచి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఉంటే అది చూసిన ప్రేక్షకులు సినిమాపై కొంతవరకైనా ఒక అంచనాకు వచ్చి ఉండేవారని, అయితే ఒక్కసారిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ప్రేక్షకులు దానికి పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారని చెప్తున్నారు. అయితే వీటిలో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయి అనే విషయం పక్కన పెడితే కమర్షియల్ సక్సెస్ పరంగా కన్నా కూడా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాగా ఖలేజా ఇప్పటికీ కూడా మంచి పేరుతో కొనసాగుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: