టాలీవుడ్ సినిమా పరిశ్రమకి
యువ నటుడు
కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా తెరకెక్కిన
పటాస్ సినిమా ద్వారా మెగాఫోన్ పెట్టాడు
అనిల్ రావిపూడి. ఇక రిలీజ్ అనంతరం ఈ
సినిమా భారీ
సక్సెస్ ని అందుకుని తొలి సినిమాతోనే
అనిల్ రావిపూడి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మెగా
హీరో సాయి ధరమ్ తేజ్ తో
అనిల్ తీసిన సుప్రీం
సినిమా కూడా మరో విజయాన్ని సొంతం చేసుకుని ఆయనకు మరింత మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఆ పై
మాస్ రాజా రవితేజ తో
రాజా ది గ్రేట్ అలానే
విక్టరీ వెంకటేష్,
యువ హీరో వరుణ్ తేజ్ ల కలయికలో తెరకెక్కించిన
ఎఫ్ 2 సినిమాలతో మరొక రెండు
సక్సెస్ లు అందుకున్న
అనిల్ రావిపూడి ఈ ఏడాది
సంక్రాంతి కానుకగా
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు
సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరొక
బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు.
కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న
అనిల్ రావిపూడి తదుపరి తెరకెక్కించనున్న
సినిమా ఎఫ్3.
ఎఫ్2 కి సీక్వెల్ గా మరింత ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో
వెంకటేష్,
వరుణ్ తేజ్ తో పాటు మరొక
టాలీవుడ్ స్టార్ నటుడు కూడా నటించనున్నట్లు లేటెస్ట్
టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ
సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసిన
అనిల్ రావిపూడి అతి త్వరలో దీన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫిల్మ్
నగర్ వర్గాల నుండి మా
ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ
సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్
డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు చెబుతున్నారు. అలానే ఈ సినిమాని
దిల్ రాజు,
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని అలానే ఈ సినిమాలో మరొకసారి
తమన్నా, మెహరీన్ లు హీరోయిన్లుగా నటించనున్నారు అంటున్నారు. నిజానికి ఈ
సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. కాగా వారందరికీ ఇది మంచి
గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు....!