ఫైటర్ కోసం మలయాళీ నటుడు సురేష్ గోపి తో పని చేయనున్నా పూరి జగన్నాథ్

Malathiputhra
ఫైటర్ సినిమా కోసం పూరి జగన్నాథ్ మరో ప్రముఖ నటుడితో  కలిసి పని చేయబోతున్నారు . విజయదేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా ప్రజెక్టు లో భాగంగా ఒక సినిమా చేస్తున్నట్లు విషయం తెలిసిందే .. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తున్నారు .. ఈ సినిమా ద్వారా విజయదేవర కొండని పూరి జగన్నాథ్ ఒక న్యూలుక్ లో చూపెట్టడానికి రెడీ అవుతున్నారు .. ఇప్పటికే కొంత మేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఫైటర్ ..రోజుకొక న్యూస్ ని ప్రకటిస్తుంది ..

తాజాగా దీనికి సంబందించిన ఒక అప్డేట్ బయటికి వచ్చింది .అదేంటంటే ఫైటర్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం ప్రముఖ నటుడిని దర్శకుడు  సంప్రదించినట్లు  తెలుస్తుంది .. ఆ నటుడు ఎవరో కాదు మలయాళం లో కొన్ని వందల సినిమాలు చేసిన సురేష్ గోపి .. సురేష్ గోపి శంకర్ ఐ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు .. ఇప్పుడు ఈ నటుడిని పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమాలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది .. అది కూడా హీరో అయినా విజయ్ దేవరకొండ కి  తండ్రి పాత్రలో సురేష్ గోపి ని నటింపచేయాలని దర్శకుడు పూరి జగన్నాథ్ ఆలోచిస్తున్నారట ..

పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా పూరి జగన్నాథ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు .. అందుకే  అన్ని భాషల నటుల్ని తన సినిమాలో నటింపజేయాలని పూరి చూస్తున్నట్లు తెలుస్తుంది .. ఇది ఎంత వరకు నిజం  అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగవలసిందే ..  ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేయబోయే సినిమా అది కూడా మొదటిసారి పూరి జగన్నాథ్ ఒక పాన్ ఇండియా చిత్రం చేయడం తో అభిమానుల అంచనాలు పెరిగాయి .. ఈ ఫైటర్ సినిమాకి సంబందించిన కీలకమైన వార్త  డిసెంబర్ లో రాబోతుందంటూ వార్తలు వినబడుతున్నాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: