హీరోయిన్స్ అందరూ మాల్దీవ్స్ కే.. అందుకేనేమో ?
ఆ అన్ని దీవుల్లో ఫైవ్ స్టార్ ఫెసిలిటీ వుంది. సెలబ్రిటీ స్ మాత్రమే కాదు సామాన్యులకు కూడా కావాల్సినంత భద్రత వుండడంతో మన హీరోయిన్స్ అందరూ చలో మాల్దీవ్స్ లో అంటున్నారు. అదీ కాక అసలు వీసా అనేదే లేకుండా 30 రోజులు గడిపే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది. సో ఇబ్బందులు ఏవీ లేకుండా డబ్బు పాస్ పోర్ట్ ఉంటే ప్రకృతి ప్రసాదించిన ఎన్నో అద్భుతాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.
ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ వేయాలనుకున్న రకుల్ ప్రస్తుతం మాల్దీవ్స్ విహరిస్తోంది. అమ్మానాన్న.. తమ్ముడుతో ఆమె కలిసి దిగిన ఫోటోలు… వీడియోలు షేర్ చేసింది. అంటే కాదు ఆమె బికినీలో రచ్చ కూడా చేస్తోంది. ఇక మరో పక్క గౌతమ్‌ను పెళ్లి చేసుకున్న కాజల్.. హానీమూన్ స్పాట్‌గా మాల్దీవ్స్‌ను ఫిక్స్ చేసుకుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ..రచ్చ చేస్తోంది. ఇక తన భర్త పుట్టిన రోజు గడిపేందుకు సమంతా కూడా అక్కడికే వెళ్ళడం గమనార్హం. చూడాలి ఇంకా ఎంత మంది హీరోయిన్స్ మాల్దీవ్స్ బాట పడతారో ?