అభి హారికల పెళ్ళికి ఒప్పుకున్న పేరెంట్స్ ..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో కంటే ఈ సీజన్  హౌస్‌లో రెండు మూడు రొమాంటిక్ జంటలు ఉంటాయి. గత సీజన్‌లో రాహుల్-పునర్నవిలు ఉండగా.. ఈ సీజన్‌లో అఖిల్-మోనాల్, అభిజిత్-హారిక, అవినాష్-అరియానా ఇలా జంటల మధ్య రూమర్లు చాలానే ఉన్నాయి. అవినాష్-అరియానాలు క్లోజ్ గా వున్నా కాని వారిని  ఎవరు అంత  సీరియస్‌గా తీసుకోలేదనే చెప్పాలి. ఇక అఖిల్-మోనాల్‌ల మధ్య రొమాన్స్, లవ్ సీన్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీళ్ల రొమాన్స్‌తో బిగ్ బాస్ హౌస్ మాములుగా హీటెక్కలేదు.

మరోవైపు హారిక-అభిజిత్‌లు కూడా రొమాన్స్ విషయంలో అస్సలు దగ్గడం లేదు. అభిజిత్ అయితే అలిగి మరీ హగ్‌లు ఇప్పించుకుంటున్నాడు. హారిక అయితే అభిజిత్‌ని ఎవరు చిన్న మాట అన్నా అస్సలు తట్టుకోలేకపోతుంది. పైగా ఫ్రెండ్ షిప్ అని అంటున్నా.. హారిక అభిజిత్‌ని విడిచి ఉండటానికి ఇష్టపడటం లేదు. హౌస్‌లోనే కాదు.. టాస్క్‌లలోనూ అభిజిత్‌ని వేరు చేస్తే బిగ్ బాస్‌ గేమ్‌నే అన్ ఫెయిర్ అంటూ ఫైర్ అయ్యేంతగా అభికి దగ్గరౌతోంది హారిక.అయితే వీళ్ల రిలేషన్‌పై ఓపెన్ అయ్యారు హారిక తల్లి, అన్నయ్య.

హారిక తల్లి మాట్లాడుతూ.. ‘మూడు నెలలు పాటు ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ప్లేస్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి మధ్య రిలేషన్ లేకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు. అయితే అభిజిత్-హారికల మధ్య రిలేషన్ మాకు ప్యూర్ ఫ్రెండ్ షిప్‌గానే అనిపిస్తుంది.ఒకవేళ వాళ్లద్దరి మధ్య వున్నది ప్రేమే అయితే మాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అభిజిత్ వాళ్ల ఫ్యామిలీకి ఇబ్బంది లేకపోతే పెళ్లికి మాకు నో ప్రాబ్లమ్. అందరూ ఏదో అనుకుంటున్నారని కాదు వాళ్లది క్యూట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని మాకు అనిపిస్తుంది. చూసేవాళ్లు ఏదో అనుకుంటారు.. వాళ్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

హౌస్‌ నుంచి వచ్చిన నోయల్‌కి తెలుసు. అతను కూడా ఇదే చెప్పాడు. వాళ్లది క్యూట్ ఫ్రెండ్ షిప్ అని.. కానీ అభిజిత్-హారిక‌లు షో ఎండ్‌కి వచ్చేసరికి ‘అభిక’గా ట్రెండ్ అవుతున్నారు.ఈ సీజన్ మొత్తం కనెక్షన్స్ బేస్డ్‌గా సాగుతుంది. బిగ్ బాస్ థీమ్ కూడా ఇదే. వాళ్లకి ఇచ్చిన కనెక్షన్‌ని వాళ్లు సేవ్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు. గేమ్‌ని గేమ్‌లా ఆడుతున్నారు.. రిలేషన్‌ని ఎలా కాపాడుకోవాలనేది వాళ్లకి బాగా తెలుసు.

ఆటని వాళ్లు బ్యాలెన్స్ చేస్తున్నారు. బయటకు వచ్చిన తరువాత వాళ్లే చెప్తారు ఏదైనా ఉంటే.. హారిక బ్రేకప్ లవ్ స్టోరీ ఉందంటే అది ఎప్పుడూ మాతో షేర్ చేసుకోలేదు. బ్రేకప్ స్టోరీలకు మేం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. బ్రేకప్ అని చెప్పాక రిలాక్స్ అయ్యాం’ అంటూ చెప్పుకొచ్చారు హారిక అమ్మ , అన్నయ్యలు.ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: