బిగ్ బాస్ 4 : మోనాల్ గజ్జర్ సర్ధేయాల్సిందేనా..!
ఫైనల్ గా ఈవారం మోనాల్ గజ్జర్ హౌజ్ నుండి బయటకు వెల్తున్నట్టు తెలుస్తుంది. హౌజ్ లో అఖిల్ తో లవ్ ట్రాక్ నడిపించిన మోనాల్ 11 వారాలు సర్ వైవ్ అవ్వగలిగింది కాని ఇక మీదట టాస్కులు చాలా టఫ్ గా ఉండబోతున్నాయి. వీటిలో నెగ్గాలంటే కష్టపడాల్సిందే. మోనాల్ ఫిజికల్ టాస్కుల్లో అన్ ఫిట్ అంతేకాదు చాలాసార్లు ఎలిమినేషన్ నుండి చివరి నిమిషంలో తప్పించుకుంది.
అయితే ఈ వారం బిగ్ బాస్ మోనాల్ ను బయటకు పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీజన్ లో హీరోయిన్ మోనాల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ లో మరో మూడు వారాల్లో టాప్ 5 ఎవరన్నది తెలుస్తుంది. ఇప్పటికే టాప్ 5లో ఎవరెవరు ఉంటారనే కన్ ఫర్మేషన్ వచ్చేసింది.