బోరున ఏడ్చేసిన మోనాల్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సాదారణంగా బిగ్ బాస్ ప్రతి సీజన్లో ఎదో ఒక రోజు హౌస్ మేట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తుంటారు. అలా  అన్ని సీజన్స్ లో కూడా కొన్ని రోజుల జర్నీ తర్వాత హౌస్ మేట్స్ ని వాళ్ల కుటుంబసభ్యులు వచ్చి పలకరిస్తూనే ఉంటారు.బిగ్ బాస్  సీజన్ 4 నిన్నటి ఎపిసోడ్ లో కూడా కమాండెంట్ టాస్క్ లో భాగంగా అభిజిత్ వాళ్ల మదర్, అఖిల్ , హారిక, అవినాష్ వాళ్ల మదర్స్ వచ్చి వారిని ఆప్యాయంగా పలకరించి నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లిపోయారు . అయితే ఇవ్వాళ జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి రీసంట్ గా వచ్చిన బిగ్ బాస్ ప్రోమోలో మాత్రం మోనాల్ వాళ్ల మదర్ కేవలం మోనాల్ కి ఒక వాయిస్ మెసేజ్ మాత్రమే పంపింది. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ కి రాలేకపోతున్నాం బాగా ఆడు అంటూ చెప్పింది.

ఇక మోనాల్ ఎంత సెన్సిటివ్ పర్సన్ అనేది అందరికి తెలుసు.దీంతో బాగా భావోద్వేగానికి గురైన  మోనాల్ బాత్రూమ్ లోకి వెళ్లి మరీ వెక్కి వెక్కి బోరున ఏడ్చేసింది. అమ్మని గుర్తుచేసుకుంటూ బాధపడింది. దీంతో మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఎంతో ఆవేదనకి గురి అయ్యారు. మోనాల్ ని ఓదార్చలేకపోతున్నారు.

ఇక మరో పక్క  ప్రోమోలో చూసినట్లయితే, లాస్య కొడుకు జున్ను, లాస్య భర్త , అలాగే అరియానా ఫ్యామిలీ మెంబర్ వినీత్ , సోహైల్ ఫాదర్ వచ్చారు. కానీ మోనాల్ కి మాత్రం ఆడియో మెసేజ్ వచ్చినట్లుగా మాత్రమే చూపించారు. మరి తర్వాత వీడియో సందేశం ఏదైనా ప్లే చేశారా..? లేదా కేవలం ఆడియో మెసేజ్ విని మోనాల్ ఆవేదన చెందిందా తెలియాలంటే ఇవ్వాళ  ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: