వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పవన్ ఇల్లు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ కలియుగ కృష్ణుడి అవతారం రేపటి నుంచి ప్రారంభం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు పది నెలల సుధీర్ఘ విరామం తరువాత కృష్ణుడిగా పవన్ రేపు రామానాయుడు స్టుడియోలో అడుగు పెట్టబోతున్నాడని టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు గోపాలా గోపాలా సినిమాలోని వెంకటేష్ పవన్ లకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ రేపటి నుంచి ప్రారంభం కాబోతోందని ఫిలింనగర్ టాక్. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం రామానాయుడు స్టుడియోలో సినిమాలోని పవన్ ఇంటికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఇంటిని సెట్ గా వేసారు అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.  అందంగా అలంకరించిన బాల్కనీతో కూడిన ఒక చిన్న ఇంటి పై ‘గోపాలా గోపాలా’ సినిమా లోగో ఒక మూలగా ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఈ ఇంటి సెట్ కు వాడబడిన కలర్స్, బ్యాక్ గ్రౌండ్ చాల ఆకర్షణీయం గాకనిపిస్తున్నాయి. అయితే ‘గోపాలా గోపాలా’ సినిమా విషయాలు బయటకు రాకుండా ఇప్పటికే నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థుతులలో వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ ఫోటో నిజంగా ఈ సెట్ కు సంబంధించిందా? లేక పవన్ అభిమానులు ఎవరైనా అత్యుత్సాహంతో క్రియేట్ చేసిందా అన్న విషయం పై క్లారిటీ లేదు. ఏమైనా రేపు ప్రారంభం అయ్యే పవన్ సినిమాకు సంబంధించి ఒక లీక్ అప్పుడే వెబ్ మీడియాకు వచ్చింది అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: