బిగ్ బాస్ చరిత్రలో మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ ఇదేనట...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ 4 లో ఆదివారం ఎపిసోడ్ చరిత్రలో బాగా బాధాకరమైన ఎపిసోడ్ గా ఎన్నటికి నిలిచిపోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో అందరూ అనుకున్నట్లుగానే 10వ వారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యిపోయాడు. తన పేరులో ఉన్నట్లుగానే అందరి దిల్ గెలుచుకుని మరీ ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ వెళ్లిపోతుంటే , హౌస్ లో అందరూ ఎమోషనల్ అయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. నిజానికి కనెక్ట్ అయిన సోహైల్ – అఖిల్ లతో పాటుగా హారిక, అభిజిత్, లాస్య, అవినాష్ లు కూడా ఎమోషనల్ అవ్వడం బాధపడటం అనేది మెహబూబ్ గేమ్ ని ఒక్కసారిగా ప్రేక్షకులకి చూపించింది.ఇక ప్రేక్షకులు కూడా ఒక మంచి కంటెన్స్టెంట్ వెళ్లిపోయాడని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున సోహైల్ ఊహించినట్లుగానే సోహైల్ ని – మెహబూబ్ ని పెట్టి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చేశారు. లాస్ట్ వరకూ కూడా సోహైల్ ని దీనికోసమే ఆపారు. దీనివల్ల అతని చేతిలో ఎలిమినేట్ అయినంత బాధపడ్డాడు సోహైల్. చిన్నపిల్లాడిలా ఏడుస్తూ మోహబూబ్ కోసం చాలా ఎమోషనల్ అయిపోయాడు సోహైల్. ఇక స్టేజ్ పైన కూడా మెహబూబ్ తన బాధని హౌస్ మేట్స్ తో పంచుకున్నాడు. భారీ డైలాగ్స్ తో, హై డ్రామాతో సాగిన ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకుల హృదయాలని సైతం కదిలించింది.మెహబూబ్ అందరి హౌస్ మేట్స్ గురించి చెప్పిన మాటలు అతని మంచి తనాన్ని నిరూపించాయి. అందరి హౌస్ మేట్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అభిజిత్ తో మాట్లాడిన తీరు నిజంగా అందరిని కంట తడి పెట్టించింది.

ఏది ఏమైనా నిన్నటి ఎపిసోడ్ మాత్రం ఎన్నడూ లేని విధంగా చాలా బాధగా సాగింది. మెహబూబ్ లాంటి ఒక టాలెంటెడ్  స్ట్రాంగ్ ప్లేయర్ హౌస్ లో నుంచి వెళ్లిపోయిన తర్వాత హౌస్ మేట్స్ ఇప్పుడు గేమ్ ని ఎలా అర్ధం చేస్కుంటారు..? ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవుతారు అనేది ఆసక్తికరం. మెహబూబ్ అంతకుముందు ట్రోల్ల్స్ ఎక్కువగా ఫేస్ చేసేవాడు. కాని ఈ బిగ్ బాస్ వల్ల అతనేంటో అందరికి తెలిసింది. బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా కాని మెహబూబ్ ఆడియన్స్ మనసులని గెలిచాడు.. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: