లెజెండరీ డైరెక్టర్ బయోపిక్ లో..!

NAGARJUNA NAKKA
లెజెండ్రీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు చనిపోయినా.. తెలుగు తెరపై స్థిరస్థాయిగా నిలిచిపోయారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచిన దర్శకరత్న జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావాలని ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఒకరు దాసరి కుటుంబ సభ్యుడు కాగా.. మిగతా ఇద్దరు బైటవాళ్లు. దాసరి బయోపిక్‌ కోసం పోటీపడుతున్న ఆ ముగ్గురు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా... స్టార్‌గా ఎదిగారు దాసరి. తాతమనవుడు అనే మూవీతో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆయన  చిన్న పెద్ద అన్న తేడా లేకుండా.. డెబ్యూ హీరోల నుంచి స్టార్స్‌ వరకు అందరికీ సూపర్‌హిట్స్‌ ఇచ్చారు దాసరి. కెవి రెడ్డి.. ఎల్వీ ప్రసాద్‌  తర్వాతి జనరేషన్‌లో దర్శకులకు గౌరవం తీసుకొచ్చారు. ఇలాంటి  మహా దర్శకుడి  బయోపిక్‌ వస్తుందంటే ఎవరికైనా ఆసక్తే.

దాసరి బయోపిక్‌ తీయడం అంత ఈజీ కాదు. ఎన్నో ఆటుపోట్లు చూశారు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన క్షణాలు ఉన్నాయి. దర్శకుడిగా, నిర్మాతగా.. రచయితగా ఆయనలోని మల్టీ టాలెంట్‌ను చూపించాలి. అలాగే..  చిరంజీవి... అక్కినేని.. రామోజీరావు వంటి లెజెండ్రీ పర్సనాలిటీతో మనస్పర్ధల కారణంగా వాళ్లకు చాలాకాలం దూరంగా వున్నారు. ఒకానొక టైంలో సినిమా తీయడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. కేంద్ర మంత్రిగా  బొగ్గు గనుల స్కాం ఆరోపణలు. ఇలా వీటన్నింటినీ చూపిస్తారా. లేదంటే.. సినిమాలకే పరిమితం చేస్తారా? ఒకవేళ దర్శకుడిగా మాత్రమే చూపిస్తే... బయోపిక్‌ సంపూర్ణం కాదు.

దాసరి బయోపిక్‌ కోసం ముగ్గురు పోటపడుతున్నారు. ఎప్పటికైనా దాసరి బయోపిక్‌ తీస్తానని.. దర్శకుడు మారుతి పేర్కొన్నాడు. దాసరికి సన్నిహితుడైన ఓ నిర్మాత ఆల్రెడీ బయోపిక్‌ పనులు మొదలుపెట్టారని తెలుస్తోంది. దాసరి కుమారుడు అరుణ్ కుమార్‌ మనసులో కూడా తండ్రి జీవిత చరిత్ర వుంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా వస్తారోగానీ.. దాసరి జీవితచరిత్ర రెండున్నర గంటల్లో పట్టేది కాదు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లా రెండు పార్టులుగా తీస్తారా? లేదంటే మహానటిలా ఒక్క పార్ట్‌తో సరిపెడతారో చూడాలి.  దాసరి బయోపిక్‌ రావాలేగానీ..  టాలీవుడ్‌ చూపంతా దీనిపైనే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: