విజయ్ ఆంటోని కొత్త సినిమా ఫస్ట్ లుక్.. చాలా కొత్తగా ఉందే..?

praveen
తమిళ నటుడు విజయ్ ఆంటోని బహు ముఖ ప్రజ్ఞాశాలి గా అన్ని  ఇండస్ట్రీల లో ఎంతగా నో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. హీరోగా సంగీత దర్శకుడి గా సినిమా దర్శకుడి గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి గా తన ప్రతిభను నిరూపించుకు ని  అందరినీ ఔరా  అనిపించాడు విజయ్ ఆంటోని. తమిళ నటుడు అయిన ప్పటికీ అటు టాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ సంపాదించు కున్నాడు. ముఖ్యం గా విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి. కథ బలంగా ఉండడం తో తమిళ హీరో సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులందరూ బిచ్చగాడు సినిమా ను ఎంతగానో ఆదరించారు.


 దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత విజయ్ ఆంటోని ఎన్నో విభిన్నమైన కాన్సెప్ట్ ల తో కూడిన సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే బిచ్చగాడు సినిమా టాలీవుడ్లో కూడా విజయం సాధించడం తో ఇక తాను నటించిన అన్ని సినిమా లు తమిళం కన్నడ భాషల తో పాటు తెలుగు లో కూడా విడుదల చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే టాలీవుడ్లో కూడా విజయ్ ఆంటోని ఎంతో మంది అభిమానుల ను సంపాదించుకున్నాడు.



 ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం విజయ్ ఆంటోని కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఆనంద్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయరాఘవన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.  ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది ఎత్తైన భవంతుల పై దర్జాగా కూర్చున్న  విజయ్ ఆంటోని చూసి అభిమానులు అందరూ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: