పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు చూస్తుంటే..!

NAGARJUNA NAKKA
చేతిలో నాలుగు సినిమాలుంటే కన్‌ఫ్యూజనే.  ఏది చేయాలో అర్థం కాదు. ముందు ఒకటి అనుకుంటే.. మరొకటి చేయాల్సి వస్తోంది. పవన్‌కల్యాణ్‌  పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. వకీల్‌సాబ్‌ తర్వాత క్రిష్‌ మూవీలో పవన్‌ జాయిన్‌ అవ్వాల్సి ఉన్నా.. నిన్నికాక మొన్న ఎనౌన్స్‌ చేసిన మూవీ ముందుగా షూటింగ్‌ జరుపుకుంటోంది. పవన్‌కల్యాణ్‌ సినిమాలు మారిపోతున్నాయి.

సినిమాలు చేయడంలో పవన్‌కల్యాణ్‌  ఎప్పుడూ లేనంతా దూకుడు చూపిస్తున్నాడు. పింక్‌ రీమేక్‌ వకీల్‌ సాబ్‌ సెట్స్‌పై ఉంది. క్రిష్‌ మూవీ రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. గబ్బర్‌సింగ్‌ తర్వాత మరోసారి హరీష్‌ శంకర్ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడు. మరోవైపు మళయాళ హిట్‌ అయ్యప్పనమ్‌ కోషియమ్‌ చేయడానికి రెడీ అయ్యాడు. తెలుగులో ఏ స్టార్‌ హీరోకూ లేనన్ని సినిమాలు పవన్‌కు ఉన్నాయి.

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత  పవన్‌ వకీల్‌సాబ్‌ షూట్‌లో ఈ మధ్యనే జాయిన్‌ అయ్యాడు. ఇంకో నెలలో సినిమాను పూర్తి చేసేస్తాడు. ఆల్ రెడీ రెండు షెడ్యూల్స్‌ జరుపుకున్న క్రిష్‌ మూవీలో జాయిన్‌ అవ్వాల్సి ఉండగా.. యూ టర్న్‌ తీసుకున్నాడు పవర్‌స్టార్‌. చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయిన తర్వాత మొదలు పెడతారనుకున్న అయ్యప్పనమ్‌ కోషియమ్‌ రీమేక్‌ను ముందుగా స్టార్ట్‌ చేసి రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేసేస్తారట. పవన్‌  అయ్యప్పనమ్‌గా కాకీ డ్రస్‌లో మరోసారి కనిపిస్తున్నాడు. కోషి రోల్ కోసం రానా సంప్రదించగా ఇంకా ఓకె చేయలేదు.

పవన్‌కల్యాణ్‌ సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. కానీ.. ఫ్యాన్స్‌ దురదృష్టం ఏమంటే.. ఏదీ అనుకున్న టైంలో మొదలుకాదు.. పూర్తికాదు. వకీల్‌సాబ్‌ లేటుగా స్టార్ట్‌ అయింది.  మధ్యలో పొలిటికల్‌గా బిజీ కావడంతో.. పవన్‌ సినిమాలకు అడ్డంకి తప్పదు.  సినిమాలు క్యూ కట్టినా.. ఏం ఉపయోగం.. ఏడాదికి రెండు రానప్పుడు? అన్న ఫీలింగ్‌తో ఉన్నా అభిమానులు. మరి స్పీడ్‌గా పూర్తిచేసి..పవన్‌ ఫ్యాన్స్‌కు ఖుషీ చేయిస్తాడా? చూడాలి మరి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: