సినీ ఇండస్ట్రీ కి శని లా దాపరించింది వాళ్లేనట .... ??
వాస్తవానికి ఎన్నో ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో ఈ కాస్టింగ్ కోచ్ ఉందని అయితే ఇటీవల టెక్నాలజీ విపరీతంగా పెరగటం అలానే పలు సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో ఇది మరింతగా బయటపడిందని అంటున్నారు. చిత్ర పరిశ్రమకి కొత్తగా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలే టార్గెట్ గా అతి కొద్దిమంది మేనేజర్లు అలానే కోఆర్డినేటర్లు మోసపూరితంగా వ్యవహరిస్తూ వారికి అవకాశాలు ఇప్పిస్తామంటూ లైంగికంగా అటువారిని వేధిస్తున్నారు అనేది క్యాస్టింగ్ కౌచ్ పై అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ వ్యక్తమవుతున్న ప్రధాన ఆరోపణ.
మరోవైపు హాలీవుడ్ చిత్ర పరిశ్రమ సహా పలు ఇతర పరిశ్రమలకు చెందిన కొందరు పేరున్న నటీమణులు కూడా ఇటీవల ఈ కాస్టింగ్ కౌచ్ విషయమై తాము పడ్డ బాధలు బయటపెట్టడంతో అందరూ విస్తుపోయారు. నిజానికి ఇటువంటి నీచమైన వ్యవహారాలకు దిగుతున్న వారు సినీ ఇండస్ట్రీకి పట్టిన శని వంటివారని అటువంటి వారి ఆగడాలు ఎక్కువ రోజులు సాగవని, తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఈ విషయమై కఠినంగా వ్యవహరించే విధంగా కార్యక్రమాలు అమలవుతున్నాయని సమాచారం. కావున చిత్రపరిశ్రమకు కొత్తగా వచ్చే అమ్మాయిలు ఈ విషయమై జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.....!!