థియేటర్లలో ఉచితంగా సినిమాలు చూడొచ్చు..!

NAGARJUNA NAKKA
థియేటర్స్‌ ఓపెన్‌ అయినా.. సినిమాలు చూడడానికి జనాలు ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు.  లాక్‌డౌన్‌ తర్వాత జనాలు ప్రయాణాలు చేస్తున్నారు. హోటల్స్‌కు వెళ్లి భయం లేకుండా తింటున్నారు. విహార యాత్రలు కూడా చేస్తున్నారు. ఎన్ని చేసినా.. థియేటర్స్‌కు వెళ్లాలనుకోవడం లేదు. వీళ్ల మైండ్‌ సెట్‌ మార్చడానికి యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ఫ్రీగా సినిమాలు చూపిస్తానంటోంది.
బాలీవుడ్‌లో యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌76కు ఓ ప్రత్యేక స్థానముంది. ఈ బేనర్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్స్‌ వచ్చాయి. 78 సినిమాలు నిర్మించిన యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ఈ ఏడాది 50వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పీవీఆర్‌ సినిమాస్‌, ఐనాక్స్‌ మూవీస్‌, ఇండియా సినీపొలిస్‌తో సహా పలు మల్టిప్లెక్స్‌లలో ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తమ సూపర్‌ హిట్‌ సినిమాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్టు తెలిపింది.
ప్రేక్షకులను మళ్ళీ థియేటర్లకు రప్పించే వ్యూహంలో యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది. వీర్‌ జారా నుంచి సుల్తాన్‌ వరకు అంటే పాత క్లాసిక్‌ నుంచి నేటి సూపర్‌ హిట్‌ మూవీలను 8 రోజులు ఉచితంగా ప్రదర్శిస్తారు.
ప్రేక్షకులను థియేటర్స్‌లోకి రప్పించే క్రమంలో ఓల్డ్‌ క్లాసిక్సే దిక్కయ్యాయి. ఆ మధ్య బాహుబలి.. దిల్‌వాలే దుల్మానియా లేజాయాంగే రిలీజ్‌ చేశారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ ఓ అడుగు ముందుకేసి.. ఫ్రీగా చూపిస్తానంటోంది.  మరి ఈ ఫ్రీ స్కీమ్‌ ప్రేక్షకుల్లో భయన్ని పోగొట్టి థియేటర్స్‌కు అలవాటు పడేలా చేస్తుందో లేదో చూడాలి.
కరోనా మహమ్మారి ఎప్పుడైతే చైనా నుంచి ఇండియాకు వచ్చేసిందో ప్రజలు స్వేచ్ఛ అనేది కోల్పోయారు. గాలి పీల్చుకునేందుకు భయపడుతున్నారు అంటే పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గాలి ద్వారా కూడా కరోనా సోకుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పేశారు. అయితే ప్రజలకు వినోదం పంచే థియేటర్లు కూడా మూతపడ్డాయి. అందులో సినిమా చూసే సమయంలో డోర్స్ క్లోజ్ చేయకపోతే ఆ మజా వాళ్లకు ఉండదు. అలా మూయడం వల్ల లోపల ఉండే గాలి బయటకు ఆశించిన స్థాయిలో బయటకు వెళ్లదు. బయట గాలి లోపలకు వెళ్లదు. ఒక వేళ కరోనా పాజిటివ్ కలిగిన వ్యక్తులు అందులో ఉంటే.. ఇతరులకు ప్రమాదం ఉండవచ్చు. అందుకే థియేటర్లను క్లోజ్ చేశారు. ఇపుడు తిరిగి తెరిచినా ప్రేక్షకులు మాత్రం థియేటర్స్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే యశ్ రాజ్ ఫిలింస్ ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: