టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకొని తొలి సినిమాతోనే మహేష్ బాబుకి అత్యద్భుతమైన క్రేజ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ సినిమాలోని తొలి సన్నివేశంలో గుర్రంపై స్వారీ చేస్తూ అదరగొట్టిన మహేష్ బాబు సాధారణ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ ను కూడా ఎంతో థ్రిల్ చేసారు. వాస్తవానికి చిన్నతనంలోనే తన తండ్రితో కలిసి గుర్రపు స్వారీ చేస్తూ పలు సినిమాల్లో నటించారు మహేష్ బాబు.
ఇక తన కెరీర్ లో ఐదవ సినిమా అయిన టక్కరి దొంగ లో కో బాయ్ పాత్రలో నటించిన మహేష్ ఆ సినిమా మొత్తం తన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తోపాటు గుర్రపుస్వారీ సీన్స్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఎంతో అలరించారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరొకసారి గుర్రమెక్కే అవకాశం మహేష్ బాబుకి రాలేదు. అలానే ఎటువంటి సన్నివేశాలు కూడా ఆయన సినిమాల్లో రావటం జరగలేదు. ఇక అతి త్వరలో మహేష్ నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాటలో ఆయన మరొకసారి గుర్రపు స్వారీ చేయనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశంలో ఆయన గుర్రంతో స్వారీ చేయనున్నారని ప్రేక్షకులతోపాటు అభిమానులకు కన్నుల పండుగగా ఉండే ఈ సన్నివేశాన్ని అత్యంత భారీ లెవల్లో దర్శకుడు పరశురామ్ తీయనున్నారని అంటున్నారు.
ఇక నేడు అమెరికా దేశానికి తన కుటుంబంతో కలిసి పయనమైన మహేష్ బాబు అతి త్వరలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు. కాగా తొలిసారిగా ఈ సినిమా ద్వారా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్త నిజమే అయితే మాత్రం చాలా ఏళ్ళ తర్వాత మరొక సారి తెరపై సూపర్ స్టార్ గుర్రం స్వారీ చూడవచ్చన్న మాట....!!