తన హోస్టింగ్ అనుభవం గురించి చెప్పిన సమంత....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చూడండి.. మొన్ననే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన కీర్తి సురేష్.. సమంత గురించి ఒక్కమాటలో వర్ణించలేమని.. ఇప్పటి హీరోయిన్లకు ఆమె చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రయోగాలు చెయ్యడానికి కూడా సమంత చాలా ధైర్యంగా ముందుకొస్తుందని కూడా చెప్పుకొచ్చింది. కీర్తి… సమంత గురించి ఇంత స్టడీ ఎప్పుడు చేసిందో తెలీదు కానీ.. ఆమె చెప్పింది నూటికి నూరు శాతం నిజమని ప్రూవ్ అయ్యింది. ‘బిగ్ బాస్4’ దసరా ఎపిసోడ్ ను హోస్ట్ చేసి ఏకంగా 11 టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యేలా చేసింది సమంత.


ఆ వెంటనే ‘ఆహా’ కోసం `సామ్ జామ్` అనే టాక్ షోని హోస్ట్ చెయ్యడానికి ముందుకు వచ్చింది. ఇక ఈ షో గురించి సమంత మాట్లాడుతూ.. ” ‘బిగ్ బాస్ 4’ కేవ‌లం మావయ్య అడిగారని చేశాను. కానీ చాలా ఛాలెంజింగ్ గా తీసుకునే చేశాను. ఓ రాత్రి మొత్తం నిద్రపోకుండా చాలా కష్టపడ్డాను.ఆడియెన్స్ అలాగే నా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చాలా టెన్షన్ వచ్చింది. ఫైనల్ గా హ్యాపీ. అయితే దాంతో పోలిస్తే.. ‘సామ్ జామ్‌’ చాలా విభిన్న‌మైన షో. చెప్పాలంటే ఇది.. నార్మల్ టాక్ షో కాదు.

కొన్ని స‌మ‌స్య‌ల్ని ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్లే షో. నా లైఫ్ లోనే ఇది పెద్ద ఛాలెంజ్‌. నిజానికి చెప్పాలంటే… హోస్ట్ చెయ్యడం కంటే యాక్టింగ్ చెయ్యడమే ఈజీ. నేను ఎలాంటి ప్లాట్-ఫామ్లో కనిపిస్తున్నాను అనేది ఆలోచించను. నా బెస్ట్ ఎంతిస్తున్నాను అనేదే ఆలోచిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇలాంటి మరెన్నో మూవీ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: