బిగ్ బాస్ 4 : ఈ వారంలో ఫేక్ ఎలిమినేషన్ వుంటుందా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్4లో  9వ వారం ఎలిమినేషన్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అమ్మ రాజశేఖర్ ఈవారం కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఎలిమినేషన్ తప్పించుకుంటాడని , అందుకే మోనాల్ ని కానీ, లేదా అభిజిత్ ని కానీ ఫేక్ ఎలిమినేషన్ చేస్తారని అంటున్నారు. ఒకవేళ ఇలా ఫేక్ ఎలిమినేషన్ చేస్తే సీక్రెట్ రూమ్ లో ఉంచి ఒకవారం వీళ్లకి ఇమ్యూనిటీ వచ్చేలా చూస్తారని చెప్తున్నారు. నిజానికి లాస్ట్ సీజన్ లో మనం చూసినట్లయితే, రాహుల్ సిప్లిగంజ్ ని ఇలాగే ఫేక్ ఎలిమినేషన్ చేశారు.కానీ, తర్వాత నామినేషన్స్ రోజునే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేశారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే అభిజిత్ ని ఫేక్ ఎలిమినేట్ చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అభిజిత్ ని ఇలా ఫేక్ ఎలిమినేట్ చేస్తే అక్కడ చాలామంది ఎమోషన్స్ , రియాక్షన్స్ చూడొచ్చు. అప్పుడు ఎపిసోడ్ మరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

హారిక, లాస్య లు ఇద్దరూ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. అంతేకాదు, అమ్మ రియాక్షన్స్ కూడా బాగా పండుతాయి. అవినాష్, అరియానా ఫేస్ రియాక్షన్స్ కూడా చూడచ్చు. ఒకవేళ మోనాల్ ని చేసినా కూడా అఖిల్ ఈవారం నామినేట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. అది కూడా మంచి రేటింగ్ తెచ్చే అవకాశం ఉంటుంది. మరి వీరిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెడతారు అనేది ఆసక్తికరం.

అంతేకాదు, ఈవారం సాదాసీదా ఎలిమినేషన్ చేస్తే మాత్రం సోషల్ మీడియాలో ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న అమ్మరాజశేఖర్ మాస్టర్ హౌస్ నుంచి వెళ్లిపోతారనే అంటున్నారు. మరి ఫేక్ ఎలిమినేషన్ ఉంటుందా ? లేదా అమ్మని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారా అనేది ఆసక్తికరం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన బిగ్ బాస్ విశేషాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: