ఎప్పుడు లేని కన్ఫ్యూజన్ ఇప్పుడెందుకు సుకుమార్..?

P.Nishanth Kumar
టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.. ఆయన సినిమాలు అర్థం కావాలంటే కొంత తెలివి ఉంటే తప్పా అర్థం కానీ పరిస్థితి.. అయితే ప్రేక్షకులకు అర్థం అయ్యే కన్ఫ్యూషన్ సబ్జెక్టు చేస్తూ మంచి హిట్ లే కొట్టాడు.. ఇటీవలే రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్ సబ్జెక్టు చేసి రొటీన్ కి భిన్నంగా సినిమా చేసి హిట్ కొట్టాడు.. ఆ సినిమా తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ని మొదలుపెట్టాడు.. అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఆగిపోగా అన్ని సినిమాలు తిరిగి షూటింగ్ ప్రారంభించుకుని చాలా రోజులు అవుతున్నా పుష్ప సినిమా ఇంకా షూటింగ్ జరుపుకోకపోవడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది.

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా అయినా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. అయితే  రంగస్థలం లాంటి హిట్ కొట్టినా సుకుమార్ కి ఏదీ కలిసి రావట్లేదు అని చెప్పాలి...ఈ సినిమా మొదలైనప్పటినుంచి సుకుమార్ కి అన్ని అడ్డంకులే వస్తున్నాయి.. అదిగో ఇదిగో అంటున్నా ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు మొదలు కాలేదు.. అందుకు కారణం లేకపోలేదట..

ఈ సినిమా కి విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు.. దాంతో ధృవ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అరవింద్ స్వామి ని పెట్టాలనుకున్న. కానీ అరవింద్ స్వామి కూడాఈ సినిమా చేయడానికి సముఖంగా లేదు.. తర్వాత  బాబీ సింహా, నారా రోహిత్.. ఇలా ఏవేవో పేర్లు వినిపించాయి. తాజాగా ఈ పాన్ ఇండియా సినిమాను హిందీలో సేల్ చేయడం కోసం బాబీ డియోల్‌ను ఆ పాత్రకు తీసుకుంటే ఎలా ఉంటుందని సుక్కు యోచిస్తున్నాడట. కానీ ఎవరినీ ఇప్పటిదాకా ఓకే చేయలేదు. ఈ కన్ఫ్యూజన్ వల్ల మెయిన్ విలన్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేస్తున్నాడు. తొలి రెండు షెడ్యూళ్లు విలన్ లేకుండానే కానిచ్చేస్తారట. ఆలోపు ఒక పేరు ఖరారు చేసి తర్వాతి షెడ్యూల్‌కు రప్పిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: