ఆ డేట్ కి ఫిక్స్ అయిన మెగా మేనల్లుడు.. మరి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..??

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఏకంగా సుప్రీమ్ హీరో అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తేజ్ నటించిన కొన్ని సినిమాలు ఇటీవల పరాజయం పాలయ్యాయి. అయితే కొంత విరామం తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తేజూ నటించిన 'చిత్రలహరి' సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు ఈ మెగా మేనల్లుడు. ఇక ఆ తర్వాత వచ్చిన 'ప్రతిరోజూ పండగే' సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది.' ప్రతి రోజూ పండగే'తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అందుకుని వార్తల్లో నిలిచారు.

 గత ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. మిక్స్ డ్ టాక్ తోనే బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది. అందుకే.. ఈ లక్కీ డేట్ కే తన నెక్స్ట్ వెంచర్ ని ఫిక్స్ చేసేశారట తేజ్.ఆ వివరాల్లోకి వెళితే.. నూతన దర్శకుడు సుబ్బు కాంబినేషన్ లో సాయితేజ్ నటించిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'.నభా నటేష్ నాయికగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని తొలుత మే 1న రిలీజ్ చేయాలనుకుంది చిత్ర బృందం. అయితే కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు.

 లాక్ డౌన్ ముగిశాక రీసెంట్ గా ప్యాచ్ వర్క్ ని సైతం ఫినిష్ చేసిన యూనిట్.. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక బిగ్ స్క్రీన్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోందట.అందులో భాగంగానే.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత తేజూ.. దేవా కట్ట డైరెక్షన్ లో ఓ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: